close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. కావేరి దారిలో గోదారి

తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానం పథకాలు జోరందుకోనున్నాయి. గోదావరి, కృష్ణా జలాల అనుసంధానంపై ఒకవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కసరత్తు చేస్తుండగా.. గోదావరి జలాలను సాగర్‌ మీదుగా కావేరితో అనుసంధానించడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. జానంపేట నుంచి సాగర్‌కు పైప్‌లైన్‌ ద్వారా మళ్లించడం మేలని భావిస్తోంది. గోదావరి నుంచి కావేరికి 247 టీఎంసీల నీటిని మళ్లించడానికి రూ. 90,562.56 కోట్లు వ్యయమవుతుందని జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తుది అంచనాకు వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ప్రగతి జోరుకు ‘మన ఊరు’

దాతల సహకారంతో పల్లెలను తీర్చిదిద్దే కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు శ్రీకారం చుట్టారు. సొంతూరికి ఏదైనా చేయాలనుకునే వారి నుంచి విరాళాలు సేకరించేలా ‘మన ఊరు’ పేరిట ఈనెల 30న ప్రతి పల్లెలోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. గురువారం జరిగిన సంగారెడ్డి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. బాక్సైట్‌ను మేమే రద్దు చేశాం: తెదేపా

విశాఖలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులిచ్చిన జీవోలను రద్దు చేశామంటూ వైకాపా ప్రభుత్వం హడావుడి చేయడం హాస్యాస్పదమని, తాము ఎప్పుడో రద్దు చేసిన వాటిపై మళ్లీ రద్దు ఉత్తర్వులు జారీ చేయడం తుగ్లక్‌ చర్య కాకపోతే మరేంటని తెదేపా నాయకులు విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. డ్రైవింగ్‌ లైసెన్స్‌కు విద్యార్హత అవసరం లేదు!

రవాణా వాహన డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు ఇప్పటివరకు ఉన్న కనీస విద్యార్హత నిబంధన త్వరలో రద్దు కానుంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు కేంద్రం ఈ సవరణ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోనూ దీన్ని అమలు చేసేందుకు అనుమతి కోరుతూ అధికారులు ప్రభుత్వానికి దస్త్రం పంపారు. ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు ఇప్పటివరకూ 8వ తరగతి కనీస విద్యార్హతగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. హైదరాబాద్‌లో వేలాది మంది రోహింగ్యాలు

రోహింగ్యాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ నగరంలో ఆరువేల మందికి పైగా రోహింగ్యాలు ఉన్నారని.. జమ్మూకశ్మీర్‌ తర్వాత రోహింగ్యాలు అత్యధికంగా ఉన్నది హైదరాబాద్‌లోనేనని ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి అక్రమంగా ఆధార్‌ కార్డులు, ఇతర ధ్రువపత్రాలు జారీ అయిన విషయంలో కొందరు తెలంగాణ పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఇంటర్నెట్‌ వాడేవారిలో పిల్లలే 15 శాతం

దేశం మొత్తం మీద ఇంటర్నెట్‌ వాడే వాళ్లు 100 మంది ఉన్నారనుకుంటే.. వీళ్లలో 15 మంది పిల్లలే ఉంటున్నారట. అది కూడా 5 నుంచి 11 ఏళ్ల వయస్సున్న వారే ఎక్కువ మంది ఉన్నారట. నాన్న ట్యాబ్‌.. అమ్మ స్మార్ట్‌ఫోన్‌.. మామయ్య ల్యాప్‌టాప్‌.. ఇలా కుటుంబ సభ్యులు వాడే రకరకాల ఎలక్ట్రానిక్‌ పరికరాలే వాళ్లకు ఇంటర్నెట్‌ సాధనాలు అవుతున్నాయట. ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ) తన ‘ఇండియా ఇంటర్నెట్‌ 2019’ నివేదికలో పై విషయాలను వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ‘పాక్‌తో చర్చలు జరపలేం’

ఉగ్రవాదమే రాజనీతిగా భావిస్తున్న పొరుగుదేశంతో చర్చలు జరపలేమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌ చెప్పారు. బుధవారం ఇక్కడ జరిగిన ఓ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌ చట్టబద్ధమైన సాధనంగా పరిగణిస్తోందన్నారు. కేవలం కశ్మీర్‌పైనే భారత్‌- పాక్‌ల మధ్య విభేదాలు లేవని, చాలా అంశాల్లో అది ఒకటి మాత్రమేనని అన్నారు.

8. సముద్రం నుంచి పుట్టిన దేశం

9. ఎనిమిదో ఖండాన్ని కనుగొన్నారు..

ఇప్పటివరకూ వెలుగు చూడని 8వ ఖండాన్ని నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మధ్యధరా ప్రాంతంలోని సంక్లిష్టమైన భౌగోళిక శాస్త్ర పరిణామక్రమాన్ని శోధిస్తున్న సమయంలో ఇది కనిపించింది. అది ఊహాజనిత దీవి ‘అట్లాంటిస్‌’ కాదని వారు చెప్పారు. గ్రీన్‌లాండ్‌ పరిమాణంలో ఉన్న ఈ ఖండానికి గ్రేటర్‌ ఆడ్రియా అని పేరు పెట్టారు. దాదాపు 14 కోట్ల ఏళ్ల కిందట ఇది ఉత్తర అమెరికా నుంచి విడిపోయి దక్షిణ ఐరోపా కిందకు చేరిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. నేటి నుంచే ప్రపంచ అథ్లెటిక్స్‌

ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌కు వేళైంది. ఈ మెగా సంబరం ఆరంభం శుక్రవారమే. 200పైన దేశాలు... దాదాపు 2 వేల మంది అథ్లెట్లు పోటీపడుతున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ కూడా తన బృందాన్ని బరిలో దింపుతోంది. హిమదాస్‌, నీరజ్‌ చోప్రా లాంటి స్టార్లు లేని భారత సేన గత ప్రదర్శనల కన్నా మెరుగ్గా రాణిస్తుందా.. అనూహ్య ఫలితాలు రాబడుతుందా అనేదే ఆసక్తికరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.