close

తాజా వార్తలు

‘సైరా’: అలా తీయడం ఇదే మొదటిసారి!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దినట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి రోజుకో ఆసక్తికరమైన విషయం బయటకు వస్తోంది. తాజాగా ఇందులోని ‘జాతర’ అనే పాటను 4500 మంది డ్యాన్సర్లతో చిత్రీకరించారట. 14 రోజులపాటు ఈ ఒక్కపాట షూటింగ్‌ మాత్రమే జరిగిందట. అంతమంది డ్యాన్సర్లతో ఒక పాటను చిత్రీకరించడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ఓ ఫొటోను పోస్ట్‌ను అభిమానులతో పంచుకుంది.

‘సైరా నరసింహారెడ్డి’కి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. నయనతార కథానాయిక. రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, తమన్నా, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ కీలక పాత్రలు పోషించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.