close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. రోహింగ్యాలకు షెల్టర్‌ ఇవ్వడంలేదు: హోంమంత్రి

కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అంతా పారదర్శకంగా జరిగిందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నియామక ప్రక్రియను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారని చెప్పారు. తప్పులు జరిగాయని కొందరు ఫెయిలైన అభ్యర్థులు ప్రచారం చేస్తున్నరని హోంమంత్రి ఆరోపించారు. ఒకవేళ పొరపాట్లు జరిగినట్లు ఆధారాలు ఉంటే విచారణ జరిపిస్తామన్నారు. రోహింగ్యాలు దేశమంతటా ఉన్నారని.. ప్రత్యేకంగా తెలంగాణలో ఆశ్రయం ఇస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని హోంమంత్రి పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇదేనా మద్యపాన నిషేధం?: లోకేశ్‌

పాదయాత్రలో సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల మధ్యలోనే జగన్‌ సారా దుకాణాలు తెరుస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ‘ఇంట్లో కళాశాలకు వెళ్లే అమ్మాయిలున్నారు.. పిల్లలున్నారు.. ఇక్కడ మద్యం దుకాణాలు వద్దు మహాప్రభో’ అని మహిళలు వేడుకుంటున్నా జగన్ కనికరించడం లేదని దుయ్యబట్టారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలొద్దని ఆందోళన చేసినందుకు మహిళలు అని కూడా చూడకుండా రోడ్డు మీదకు ఈడ్చి కొట్టిస్తారా?అని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హుజూర్‌నగర్‌ బరిలో తెదేపా

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో పోటీ చేయాలని తెదేపా నిర్ణయించింది. ఈ మేరకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో శనివారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి సమావేశం అనంతరం వెల్లడించారు. గతంలో హుజూర్‌నగర్‌ ఎన్నికల్లో తాము పాల్గొనకపోయినప్పటికీ తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరిక మేరకు పోటీ చేస్తున్నట్లు రావుల ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బోటు వెలికితీతకు రూ.22 లక్షలు: కలెక్టర్‌

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇంకా 15 మంది ఆచూకీ లభించాల్సి ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి అన్నారు. బోటును బయటికి తీసేందుకు నిపుణుల సలహా తీసుకున్నట్లు తెలిపారు. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్‌ సంస్థకు బోటును బయటికి తీసేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. దీనికిగాను రూ. 22.7 లక్షల ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికే బాలాజీ మెరైన్స్‌ సంస్థ బోటును వెలికితీసే పనులు ప్రారంభించిందని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘మార్గదర్శి’ ఎండీకి బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డు

చిట్‌ఫండ్‌ రంగాన్ని యజమానుల్లా కాకుండా సంరక్షకుల్లా నిర్వహించాలని మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు. అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్ శైలజా కిరణ్‌ను బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డుతో సత్కరించింది. చెన్నైలోని మద్రాస్‌ మేనేజ్‌మెంట్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆర్‌బీఐ పార్ట్‌టైం డైరెక్టర్‌ ఎస్‌ గురుమూర్తి ఈ అవార్డు ప్రదానం చేశారు. గత 57 ఏళ్లుగా దక్షిణాదిన నాణ్యమైన సేవలను అందిస్తున్న విశ్వసనీయమైన సంస్థగా మార్గదర్శి ప్రజల నమ్మకాన్ని చూరగొందని నిర్వాహకులు ప్రశంసించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పాకిస్థాన్‌ ప్రధానిపై భారత్‌లో కేసు నమోదు

అంతర్జాతీయ వేదికపై భారత్‌పై విషం చిమ్మిన పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై కేసు నమోదైంది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో సుధీర్‌ కుమార్‌ ఓఝా అనే న్యాయవాది చీఫ్‌ జ్యుడీషియల్‌ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఇమ్రాన్‌ భారత్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనీ.. అణుయుద్ధం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదు ఆధారంగా న్యాయస్థానం ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని ఇమ్రాన్‌ ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సమస్యలుంటే చెప్పండి.. విద్యార్థులతో యోగి

యూపీలో చదువుకునే జమ్మూకశ్మీర్‌ విద్యార్థులకు ఏ సమస్యలున్నా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కోరారు. లఖ్‌నవూలో చదువుతున్న జమ్మూకశ్మీర్‌ విద్యార్థులతో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇక్కడ యూపీలో వారికి ఏమైనా సమస్యలుంటే అక్కడి అధికారులకు చెప్పాలి. మీ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేయడమే గాక జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అంశాలుంటే సహకరిస్తుంది’ అని భరోసా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మణికట్టు ద్వయాన్ని రంగంలోకి దించండి: దాదా

మణికట్టు మాంత్రికులు కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ సూచించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో వారి పాత్ర కీలకం కాబట్టి ప్రస్తుత విరామం తాత్కాలికమనే భావిస్తున్నట్టు చెప్పాడు. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా సిరీసుల్లో వారిని పక్కనపెట్టి టీమిండియా కొత్త వారికి అవకాశమిచ్చింది. ‘ప్రస్తుత జట్టు బాగుంది. మణికట్టు మాంత్రికులను విరాట్‌ ఈ ఫార్మాట్లోకి తిరిగి తీసుకురావాలి. ఇతరులకు అవకాశం ఇచ్చేందుకే చాహల్‌కు విశ్రాంతినిచ్చారని అనుకుంటున్నా’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆర్థిక ఇబ్బందులతో టెకీ కుటుంబం ఆత్మహత్య

ఉద్యోగం పోయిందన్న మనస్తాపంతో ఓ టెకీ భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండోర్‌కు చెందిన అభిషేక్‌ సక్సేనా (45) ఉద్యోగం కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అదే సమయంలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో కూడా తీవ్ర నష్టాలు రావడంతో మరింత కుంగుబాటుకు గురయ్యాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్య ప్రీతి సక్సేనా(42), అద్విత్‌ (14), అనన్య(14)లతో కలిసి ఓ రిసార్ట్‌లో గది తీసుకున్నాడు. ఆన్‌లైన్‌లో సోడియం నైట్రెట్‌ ఆర్డర్‌ ఇచ్చి తెప్పించుకున్నారు. దానిని ముందుగా భార్య, పిల్లలకు ఇచ్చి అనంతరం అభిషేక్‌ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అలాంటి పాత్రలో నటించాలనేదే తన కల: చిరంజీవి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.