close

తాజా వార్తలు

‘హౌడీ-మోదీ’ విజయవంతమైంది: మోదీ

దిల్లీ: అమెరికాలో జరిగిన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమం విజయవంతమైందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.  వారం రోజుల అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన ఆయనకు దిల్లీలోని పాలెం విమానాశ్రయంలో భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. 2014లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఐరాసకు వెళ్లానని.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఐరాసకు వెళ్లినట్లు చెప్పారు. ఈ ఐదేళ్లలో పెద్దమార్పును చూసినట్లుగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. హ్యూస్టన్‌లో భారతీయులు ప్రదర్శించిన స్ఫూర్తి మరువలేనిదన్నారు. రేపటి నుంచి దేశవ్యాప్తంగా నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.