close

తాజా వార్తలు

బుమ్రా గాయానికి కారణం ఇదే: నెహ్రా

దిల్లీ: భారత పేస్‌ దళపతి జస్ప్రీత్‌ బుమ్రా గాయానికి అతడి బౌలింగ్‌ శైలి కారణం కాదని టీమ్‌ఇండియా మాజీ పేసర్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. వెన్ను గాయంతో  బాధపడుతున్న బుమ్రా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అతడి గాయంపై నెహ్రా స్పందించాడు. ‘వెన్ను గాయానికి తన బౌలింగ్‌ శైలి కారణం కాదని స్పష్టంగా తెలుస్తోంది.  భిన్నమైన తన బౌలింగ్‌ శైలిని అతడు మార్చుకోనవసరం లేదు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చాక అతడు మరింత వేగంగా బంతుల్ని సంధిస్తాడు. భిన్నమైన తన శైలికి అతడి శరీరం ఎంతో సహకరిస్తుంది. ఎడమచేతిని పూర్తిగా పైకి లేపకుండానే అతడు బంతుల్ని విసరగలడు. మలింగ శైలి కంటే బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ పది రెట్లు గొప్పది. మలింగ జావెలిన్‌ త్రో ఆటగాడిలా బంతుల్ని సంధిస్తాడు’ అని పేర్కొన్నాడు.

‘గాయం నుంచి కోలుకోవటానికి బుమ్రాకు దాదాపు రెండు నెలల సమయం పడుతుంది. కొన్ని సార్లు ఆరు నెలలు కూడా అవ్వొచ్చు. మ్యాచ్‌కు ఎప్పుడు సిద్ధమనే విషయం ఆటగాడికి మాత్రమే తెలుసు. ఇతర గాయాల మాదిరిగా వెన్ను గాయం అంత తేలికైనది కాదు. దీనిని ఎంఆర్‌ఐ స్కాన్‌లో గుర్తించలేం. ఎముకల స్కాన్‌ ప్లేట్స్‌ మాత్రమే గుర్తిస్తాయి. ఫాస్ట్‌ బౌలర్‌కు ఇలాంటి గాయాలు చాలా ఉంటాయి. అలా అని, క్రికెట్‌కు దూరమవ్వలేము. వాటిని అధిగమించి బరిలోకి దిగాలి. మూడేళ్ల నుంచి టీమ్‌ఇండియాలో ఆడుతున్న బుమ్రాకు తన శరీరంపై పూర్తి అవగాహన ఉంది. అతడు గాయం నుంచి కోలుకుని అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం ఉంది’ అని నెహ్రా తెలిపాడు.  

వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఒత్తిడి కారణంగా అతడి వెన్నులో కింది వైపున చిన్న చీలిక వచ్చిందని వైద్యులు తేల్చారు. కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని సూచించారు. నవంబర్‌ చివరి వరకు జట్టుకు అందుబాటులో ఉండడు. అతడి స్థానంలో సెలక్టర్లు ఉమేశ్‌ యాదవ్‌కు చోటిచ్చారు. బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడు. బహుశా బంగ్లాదేశ్ సిరీస్‌కూ అతడు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. గాయం ముందుగానే తెలియడం మంచిదైందని లేకుంటే కోలుకొనేందుకు ఇంకా ఎక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 2న విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన తొలి టెస్టును ఆడనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.