close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తిరుమాడ వీధులను పరిశీలించారు. ఆలయ నైరుతి మూలలో అర్చకులు భూమి పూజ నిర్వహించారు. ఈ అంకురార్పణ క్రతువుతో ఈ మహావేడుక ప్రారంభమైంది. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలతో తిరుమల గిరులు  పండగ శోభను సంతరించుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బొగ్గు సరఫరాపై కేసీఆర్‌కు జగన్ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సింగరేణి నుంచి బొగ్గు సరఫరా పెంచాలని ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకు కూడా సీఎం లేఖ రాశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 5,050 మెగావాట్లుగా ఉందని.. బొగ్గు కోసం మహానది కోల్‌ లిమిటెడ్‌ (ఎంసీఎల్), సింగరేణితో థర్మల్‌ కేంద్రాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కామ్రేడ్స్‌..కేసీఆర్‌ మాటలుమర్చిపోవద్దు:ఉత్తమ్‌

ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే సీపీఐ మద్దతు కోసం తెరాస నాయకులు ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. కమ్యూనిస్టులకు ఓట్లు ఎక్కడివి అంటూ గత ఆరేళ్లలో సీఎం కేసీఆర్‌ అవమానపరిచిన విషయాన్ని మర్చిపోవద్దని సీపీఐ నేతలకు ఆయన సూచించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో తెరాసకు బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఉత్తమ్‌ విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సుగంధద్రవ్యాలతో భారీ చిత్రం..గిన్నిస్‌ దిశగా

పసుపు, కుంకుమతో ప్రపంచంలోనే పెద్ద చిత్తరువును గీసి గిన్నిస్ రికార్డు దిశగా దూసుకెళ్లింది అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ విద్యార్థిని తాతినేని శ్రేయ. సుమారు నాలుగున్నర గంటలపాటు శ్రమించి ఏకధాటిగా చిత్రాన్ని గీసి ఔరా అనిపించింది. ప్రతిష్ఠాత్మక ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ఈ అరుదైన ప్రదర్శనకు వేదికైంది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రేయ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయం ముడిపడి ఉన్న పసుపు, కుంకుమతో అపురూపమైన చిత్రాన్ని రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అవినీతిపై ప్రశ్నిస్తే ఎదురుదాడి:లక్ష్మణ్‌

ఈఎస్‌ఐ అవినీతి కేసులో నిందితులను తప్పించేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతుందని.. అన్ని శాఖలు అవినీతిమయంలో చిక్కుకున్నాయని ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఫోన్‌ కాల్‌.. పోలీసులను పరుగులు పెట్టించింది

దిల్లీ రైల్వే స్టేషన్‌లో ఇద్దరి వ్యక్తులపై అనుమానంతో మరో వ్యక్తి చేసిన ఓ ఫోన్‌ కాల్‌ రెండు రాష్ట్రాల పోలీసులను పరుగులు పెట్టించింది. చివరికి భయపడాల్సిన విషయమేమీ లేదని తేలడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫారంపై ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఉగ్రవాదుల మాటల్లా ఉన్నాయని ఓ వ్యక్తి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గురూ‘జీ’, పితా‘జీ’, మాతా‘జీ’ మాత్రమే ఉండేవారు..

ఏడు పదుల వయస్సులోను సామాజిక మాధ్యమాలలో బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఎంత చురుగ్గా ఉంటారో అందరికి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి ఆయన చేసిన సరదా ట్వీట్‌ ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుత 3జీ, 4జీ నెట్‌వర్క్‌లను ఉద్దేశిస్తూ ఆయన ‘ మా చిన్నతనంలో 3జీ, 4జీ, 5జీ ఏమి లేవు, కేవలం గురు‘జీ’, పితా‘జీ’, మాతా‘జీ’ మాత్రమే ఉండేవారు. కేవలం ఒకే చెంపదెబ్బతో నెట్‌వర్క్‌ వచ్చేది’ అనే అర్థం వచ్చేలా ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మహా పోల్స్‌: 125+ స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ!

మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెల జరగనున్న ఎన్నికల్లో ఎన్సీపీతో పొత్తులో భాగంగా 125 కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయనుంది. చెరో 125 సీట్లలో పోటీ చేయాలన్న ముందస్తు ఒప్పందాని కంటే అధిక స్థానాల్లో పోటీ చేయనుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్‌ తోరట్‌ సూచన ప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఎన్సీపీ నేత ధనుంజయ్‌ ముండేతో భేటీ అనంతరం ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐఐటీలోప్రసంగానికి సలహాలు కోరిన మోదీ!

ఐఐటీ మద్రాస్‌లో సోమవారం జరగబోయే స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో తన ప్రసంగానికి విలువైన సలహాలు, సూచనలు జోడించాలని దేశ ప్రజలను కోరారు. ముఖ్యంగా ఐఐటీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తమ ఆలోచనల్ని తప్పకుండా పంచుకోవాలని కోరారు. నమో యాప్‌లోని ఓపెన్‌ ఫోరం ద్వారా తమ సలహాల్ని పంపించొచ్చని తెలిపారు. చెన్నైలో జరిగే మరో కార్యక్రమంలో సింగపూర్‌-ఇండియా హ్యాకథాన్‌ పోటీల్లో విజేతలకు పురస్కారాలు అందజేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వడ్డీరేట్లు మరోసారి తగ్గే అవకాశం..?

ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను శుక్రవారం మరోమారు తగ్గించే అవకాశం ఉంది. ఇదే జరిగితే వరుసగా ఐదోసారి వడ్డీరేట్లను తగ్గించినట్లవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం వ్యాపార అనుకూల వాతావరణం నెలకొల్పడానికి కార్పొరేట్‌ పన్నును గణనీయంగా తగ్గించింది. ఈ నేపథ్యంలో నగదు ప్రవాహం పెంచి పారిశ్రామిక  కార్యకలాపాల్లో జోష్‌ నింపేందుకు చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష కమిటీకి గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ అధ్యక్షత వహిస్తున్నారు. అక్టోబర్‌4న నాలుగో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.