
తాజా వార్తలు
విజయవాడ: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు జగన్మాత దుర్గాదేవి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపురతాపినీ ఉపనిషత్తు చెబుతోంది. ‘స్వర్గ, భూ, పాతాళం’ అనే త్రిపురాల్లో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు. శ్రీచక్రంలో ఉండే తొమ్మిది అమ్నయాల్లో మొదటి అమ్నయం త్రిపురసుందరీదేవియే. ‘శ్రీ’ విద్యలో మొదటి విద్య బాల అందుకే ఆధ్యాత్మిక విద్యను సాధన చేసేవారు మొదట బాల మంత్రాన్ని ఉపాసన చేస్తారు. త్రిపుర సుందరీ దేవి అభయహస్తముద్రతో చేతిలో అక్షరమాల ధరించి ఉంటుంది. మనసు, బుద్ధి, అహంకారం ఆమె ఆధీనంలో ఉంటాయి. ఆమెను ధ్యానించడంతో సమస్త మనోవికారాలు తొలిగి నిత్యసంతోషం కలుగుతుందని భక్తుల నమ్మకం. బాలాత్రిపుర సుందరీ దేవిని అరుణవర్ణ వస్త్రాలు ధరించి ఎర్రని పూలతో పూజ చేస్తారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- బంపర్ ఆఫర్ కొట్టేసిన షాలినీ పాండే
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- 2019లో గూగుల్‌లో అధికంగా సెర్చ్ చేసినవివే..
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
