
తాజా వార్తలు
దిల్లీ: ఇటీవలే భాజపాలో చేరిన రెజ్లర్లు బబితాఫోగట్, యోగేశ్వర్‌దత్‌లకు భాజపా టికెట్లు కేటాయించింది. వీరిద్దరు హరియాణా శాసనసభా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మంగళవారం వెల్లడించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు భాజపా నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల తొలిజాబితాను పార్టీ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 78 స్థానాలకు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం తొమ్మిది మంది మహిళలు, ఇద్దరు ముస్లింలకు టికెట్లు దక్కాయి. ఈ సందర్భంగా వారు పోటీ చేయబోయే స్థానాలపై అరుణ్‌సింగ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కర్నాల్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా క్రీడా ప్రముఖులు ఫోగట్ దద్రి నుంచి, యోగేశ్ బరోడా స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. హరియాణా భాజపా చీఫ్ సుభాష్ బార్లాకు తోహానా స్థానం, మంత్రులైన రావ్నర్బీర్కు బాద్షాపూర్, విపుల్గోయెల్కు ఫరీదాబాద్ స్థానాలను కేటాయించినట్లు చెప్పారు. హరియాణాలో భాజపా తమకు ఎక్కడైతే గట్టి పోటీ ఉంటుందో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే పలు ర్యాలీలు నిర్వహించింది. జాతీయ పౌర రిజిస్టర్ అమలు ప్రధాన అంశంగా భాజపా ఎన్నికల్లో బరిలోకి దిగుతుండటం గమనార్హం.
ప్రధాని మోదీకి పెద్ద అభిమానిని: ఫోగట్
ప్రముఖ క్రీడాకారిణి బబితాఫోగట్ తన తండ్రి మహవీర్ఫోగట్తో కలిసి గత ఆగస్టులో భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఆమె కామన్వెల్త్ క్రీడల్లో బంగారు, వెండి పతకాలు సాధించారు. బబితా జమ్మూకశ్మీర్ సహా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు గతంలో మద్దతు పలికారు. అంతేకాకుండా ఆమె 2014 నుంచి ప్రధాని నరేంద్రమోదీకి పెద్ద అభిమానినని, ఆయన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని భాజపాలో చేరిన సమయంలో వెల్లడించారు. యోగేశ్వర్ దత్ కూడా ఇటీవలె భాజపాలో చేరారు.
మహారాష్ట్ర, హరియాణాల అసెంబ్లీలకు అక్టోబర్ 21 ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 24న వెలువడనున్నాయి. కాగా నామినేషన్లకు తుది గడువు అక్టోబర్ 4న నిర్ణయించారు. హరియాణాలో 1.8కోట్ల మంది ఓటర్లు ఉండగా, మహారాష్ట్రలో 8.9కోట్ల మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2014 హరియాణా శాసనసభ ఎన్నికల్లో భాజపా 47 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 15, ఐఎన్ఎల్డీ 19, మిగతా స్థానాల్లో స్వతంత్ర పార్టీలు విజయం సాధించాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
