close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. మద్యం ధరల పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచింది. స్వదేశీ, విదేశీ మద్యం సీసాలపై వాటి పరిమాణాన్ని బట్టి కనిష్ఠంగా రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.250 వరకూ పెంచింది. రెడీ టూ డ్రింక్‌ కింద విక్రయించే 250/275 ఎంఎల్‌ పరిమాణం కలిగిన సీసాలపై రూ.20 పెంచింది. ధరలు పెంచుతూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం నుంచే ఈ పెరుగుదల అమల్లోకి రానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. నేటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పులు

ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళల్లో అక్టోబరు 1 నుంచి మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా.. రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళల్లో ఒకటి ఎంపిక చేసుకుని అమలు చేస్తారు. 1. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు, 2. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు, 3. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు ఈ మూడు రకాల పనివేళలను భారత బ్యాంకర్ల సంఘం (ఐబీఏ) సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఇది ప్రజలకు, నియంతకు మధ్య పోరు

తెలంగాణ ఆత్మగౌరవం నిలబడేలా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన మొదటిసభ సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతిరెడ్డిని గెలిపించి నియంతృత్వ పోకడతో పోతున్న తెరాస ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్నారు. ఈ ఎన్నిక ప్రజలకు, నియంతకు మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఆర్టీసీపై చర్చించనున్న మంత్రిమండలి!

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిస్థితులపై మంగళవారం జరగనున్న తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొత్త సచివాలయ నిర్మాణానికి ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం..వాటితో పాటు, ఖరీఫ్‌ ఉత్పత్తులు, ధాన్యం సేకరణ, రబీ సన్నాహాలపైనా చర్చించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. గల్ఫ్‌ వలస కార్మికుల వివరాల సేకరణ

తెలంగాణ నుంచి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. నిజామాబాద్‌ జిల్లా నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. తర్వాత మిగిలిన జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గల్ఫ్‌ దేశాల్లో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సమాచార సేకరణకు పూనుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. హైదరాబాద్‌ కూడళ్లలో అత్యాధునిక కెమెరాలు

మీరు రెడ్‌లైట్‌ దాటారా.. సిగ్నల్‌ రాకున్నా వాహనాన్ని ముందుకు నడిపారా.. రాంగ్‌రూట్‌లో వెళ్లారా.. ఇలా ఏ తప్పిదం చేసినా.. వెంటనే కెమెరా కళ్లు పట్టేస్తాయి. హైదరాబాద్‌లోని పలు కూడళ్లలో ట్రాఫిక్‌ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమున్న ప్రత్యేక కెమెరాలను అమర్చారు. వీటిలో జర్మనీ సాంకేతిక పరిజ్ఞానం, వాహనాల నంబరు ప్లేట్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. 8న దేశవ్యాప్త సమ్మె

ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక విధానాలకు ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. టీచర్లకు బూత్‌ స్థాయి విధులొద్దు

దేశంలో చాలాచోట్ల ఉపాధ్యాయుల కొరత ఉన్నందున ఎన్నికల సమయంలో టీచర్లను బూత్‌ స్థాయి అధికారులుగా నియమించొద్దని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ (పాఠశాల విద్య) కార్యదర్శి రీనారే కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల విధులైతే ఒకటి, రెండురోజుల్లో పూర్తవుతాయని.. అదే బూత్‌ స్థాయి అధికారిగా నియమిస్తే నెలల తరబడి శిక్షణకు హాజరు కావాల్సి వస్తుందని, దానివల్ల బోధనకు ఇబ్బంది ఎదురవుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మీ బ్యాంకు చేతులెత్తేస్తే.....

ఒక బ్యాంకు దివాలా తీస్తే.. ఖాతాదారులకు వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు డిపాజిట్‌ బీమా సౌకర్యం ఉంటుంది. మన దేశంలో చాలా బ్యాంకులు ఈ డిపాజిట్‌ బీమాను అమలు చేస్తున్నాయి. ఇందుకోసం ఉన్నదే ‘డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ). ఖాతాదారుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండానే.. బ్యాంకులు చెల్లించే ప్రీమియంతో ఈ సంస్థ డిపాజిటర్లకు, నిర్దేశించిన గరిష్ఠ మొత్తం వరకూ డిపాజిట్‌ బీమా భద్రతను కల్పిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. అన్ను.. అదరగొట్టింది

భారత అథ్లెట్‌ అన్నురాణి నుంచి అదిరే ప్రదర్శన. జావెలిన్‌త్రోలో అంచనాలకు మించి రాణించిన ఈ ఉత్తర్‌ప్రదేశ్‌ అమ్మాయి జాతీయ రికార్డు తిరగరాస్తూ ఫైనల్లో ప్రవేశించింది. సోమవారం జరిగిన హీట్స్‌లో అన్ను.. జావెలిన్‌ను 62.43 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్‌త్రోలో ఫైనల్‌ చేరిన తొలి భారత అథ్లెట్‌ అన్నునే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.