close

తాజా వార్తలు

చైనాను ఎవ్వరూ ఏం చేయలేరు

యూఎస్‌కు చైనా అధ్యక్షుడి పరోక్ష హెచ్చరిక

బీజింగ్‌: చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి 70ఏళ్లయిన సందర్భంగా బీజింగ్‌లోని తియన్మాన్‌ స్వ్కేర్‌లో అతి పెద్ద పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, హైటెక్ డ్రోనులతో సుమారు 15వేల బృందాలు ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. ‘70’ ఆకారంలో విమానాలు విన్యాసాలు చేశాయి. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద పరేడ్‌గా ఆ దేశ మీడియా వర్ణించింది. ఈ కార్యక్రమంలో జిన్‌పింగ్‌ ప్రసంగించారు.

‘చైనా ప్రజలను ఎవరూ ఎదుర్కోలేరు. ఏ శక్తీ మనల్ని ఏమీ చేయలేదు. మనదేశ పునాదులను కదిలించే సత్తా ఎవరికీలేదు. ఈ దేశం అన్ని విధాలా దూసుకుపోతుంది. పేదరికం నుంచి ప్రపంచంలో రెండో ఆర్థిక శక్తిగా ఎదిగాం. ఇంకా అభివృద్ధి సాధించగల సత్తా మనకుంది’ అంటూ పరోక్షంగా అమెరికానుద్దేశించి మాట్లాడారు. గత కొన్ని రోజులుగా అగ్రరాజ్యం-చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.