close

తాజా వార్తలు

కోహ్లీ ఇంకో 281 పరుగులు చేస్తే చరిత్ర సృష్టిస్తాడు!  

విశాఖ టెస్టులో చేరుకుంటాడా?

విశాఖపట్నం: క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ పేరిట ఉన్న మరో రికార్డుకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేరువలో ఉన్నాడు. బుధవారం నుంచి విశాఖలో దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ మరో 281 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 21 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ ఇదివరకు 473 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా విండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా 485 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. ఇదిలా ఉండగా విరాట్‌కోహ్లీ ప్రస్తుతం వీరిద్దరికన్నా ఎంతో ముందంజలో ఉన్నాడు. 

టీమిండియా కెప్టెన్‌ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 432 ఇన్నింగ్స్‌ల్లో 20,719 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో సచిన్‌ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీకి ఇంకా ఎంతో సమయం పట్టదు. ప్రస్తుత ఫామ్‌ చూస్తే ఈ సిరీస్‌లోనే ఆ ఘనత సాధించి చరిత్ర సృష్టించేలా కనిపిస్తున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికాపై అతడికి గతంలోనూ మంచి రికార్డు ఉంది. పర్యాటక జట్టుపై కోహ్లీ మొత్తం 9 మ్యాచ్‌ల్లో 47.37 సగటుతో 758 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలు, మూడు అర్ధశతకాలు ఉన్నాయి.  

టీమిండియా టెస్టు చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌గా ఇటీవలే పేరుతెచ్చుకున్న కోహ్లీ నెల క్రితం విండీస్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ పూర్తయ్యాక తన కెప్టెన్సీపై స్పందించాడు. జట్టుకు నాయకత్వం వహించడమంటే అతడి పేరు ముందు c అనే అక్షరం మాత్రమే ఉంటుందని, అంతకుమించి తనలో ఏ ప్రత్యేకతా ఉండదన్నాడు. జట్టు సమష్టిగా రాణిస్తేనే విజయపథంలో నడుస్తుందని, అత్యుత్తమ జట్టు ఉన్నందునే విండీస్‌పై గెలిచామని చెప్పాడు. ఇప్పుడు జట్టులో ఉన్న బౌలర్లు లేకుంటే విండీస్‌పై సిరీస్‌ నెగ్గేవాళ్లం కాదని కోహ్లీ పేర్కొన్నాడు. విండీస్‌పై 2-0తో టెస్టు సిరీస్‌ గెలిచిన భారత్‌ తదుపరి దక్షిణాఫ్రికాపై విజయం సాధించి స్వదేశంలో విజయ యాత్రని కొనసాగించాని చూస్తోంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.