close

తాజా వార్తలు

తొలి టెస్టు:పంత్‌ ఔట్‌.. సాహా ఇన్‌

తుది జట్టుని ప్రకటించిన టీమిండియా

విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో బుధవారం నుంచి జరగబోయే తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌, కీపర్‌ రిషభ్‌పంత్‌కు బదులు వృద్ధిమాన్‌ సాహాని తుది జట్టులోకి తీసుకున్నామని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ సాహా గతంలో జట్టు అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడ్డాడని, తొలి టెస్టులో పంత్‌కి బదులు ఇతడినే ఆడిస్తామని వెల్లడించాడు. సాహా గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమయ్యాడని, అతడో అత్యుత్తమ కీపర్‌ అని మెచ్చుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితులతో పాటు గతంలో జట్టుకు అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని అతడికి అవకాశమిచ్చినట్లు కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌కు తగిన అవకాశాలు ఇవ్వాలని భావించామని, అయితే ఉన్నపళంగా రాణించాలని అతడిపై ఒత్తిడి తీసుకురావాలనుకోవట్లేదని కోహ్లీ అన్నాడు. అతడికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడని, విదేశాల్లో అతడి ప్రతిభ కారణంగా మరిన్ని అవకాశాలిస్తామని కోహ్లీ పేర్కొన్నాడు. మరోవైపు సాహా టెస్టుల్లో కీపర్‌గా జట్టు అవసరాలకు ఉపయోగపడతాడని, గతంలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాగా ఆడాడని వివరించాడు. ఒక కెప్టెన్‌గా ఏ ఆటగాడికి ఎప్పుడు అవకాశాలు ఇవ్వాలో తెలుసుండాలని కోహ్లీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. 

ఇలాంటి నిర్ణయాలు చాలా సున్నితమైనవని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తీసుకున్న నిర్ణయంపై ధైర్యంగా ముందుకు సాగాలని కోహ్లీ అన్నాడు. ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై జట్టు యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని, సాహాను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. సాహా ఇప్పటివరకు 32 టెస్టులాడి 1164 పరుగులు చేయగా అందులో మూడు శతకాలు, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి.

తొలి టెస్టుకు తుది జట్టు: 
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్యా రహానె(వైస్‌కెప్టెన్‌), రోహిత్‌శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, అశ్విన్‌, జడేజా, సాహా(కీపర్‌), ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.