close

తాజా వార్తలు

125మందితో భాజపా తొలి ‘మహా’ జాబితా

ముంబయి: మహారాష్ట్రలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఇటీవలే ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించడంతో రాజకీయ పార్టీలన్నీ గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంలో తలమునకలై ఉన్నాయి. ఈ క్రమంలో అధికార భాజపా తమ పార్టీ తరఫున బరిలోకి దించబోయే అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు మొత్తం 125 మంది  అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ నెల 21న మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించడమే లక్ష్యంగా కమలదళం పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. 

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నాగ్‌పూర్‌ సౌత్‌ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో దిగుతున్నారు. అలాగే, కొత్రుద్ నియోజకవర్గం నుంచి చంద్రకాంత్‌ పాటిల్‌ బరిలోకి దిగుతుండగా.. శివాజీ మహారాజ్‌ కుటుంబానికి చెందిన శివేంద్ర సింగ్‌ను సతారా నియోజకవర్గం నుంచి భాజపా పోటీలో దించుతోంది.  తొలి జాబితాలో 12 మంది సిట్టింగ్‌లకు భాజపా టికెట్లు నిరాకరించింది. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర శాసనసభకు జరగబోయే ఎన్నికల్లో 200కు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తామంటూ భాజపా నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. మిత్రపక్షమైన శివసేనతో కలిసి ఎన్నికల్లో భాజపా పోటీచేస్తున్న విషయం తెలిసిందే.

124 మందితో శివసేన తొలి జాబితా!

మరోవైపు, భాజపాతో కలిసి ఎన్నికల బరిలో దిగుతున్న శివసేన కూడా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల జాబితా రూపకల్పనపై తీవ్ర కసరత్తు చేసిన శివసేన మంగళవారం 124 మందితో తొలి జాబితాను ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 21న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా.. 24న ఫలితాలు వెల్లడికానున్నాయి.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.