close

తాజా వార్తలు

సెహ్వాగ్‌తో రోహిత్‌శర్మను పోల్చిన కోహ్లీ

హిట్‌మ్యాన్‌ ఓపెనింగ్‌పై కెప్టెన్‌ క్లారిటి

విశాఖపట్నం: టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌తో పోల్చాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు మీడియాతో ముచ్చటించిన కెప్టెన్‌.. టెస్టు క్రికెట్‌లో రోహిత్‌శర్మ ఓపెనింగ్‌పై స్పందించాడు. రోహిత్‌శర్మ ప్రపంచంలో ఎక్కడైనా సహజసిద్ధమైన బ్యాటింగ్‌ చేస్తే ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ మొత్తమే మారిపోతుందని కోహ్లీ పేర్కొన్నాడు. ఐదారు టెస్టుల్లో అతడిని ఓపెనర్‌గా దించడానికి టీమిండియా ఆలోచిస్తుందా అని ఒక విలేకరి అడగ్గా.. ఇప్పటికిప్పుడే రోహిత్‌ దంచి కొట్టాలని జట్టు కోరుకోవడం లేదని చెప్పాడు. భారత్‌లో ఆడేటప్పుడు ఒక ప్రణాళిక, విదేశాల్లో ఆడేటప్పుడు మరో ప్రణాళిక ఉందని, ఓపెనర్‌గా వచ్చే బ్యాట్స్‌మన్‌కు అతడి ఆటపై అవగాహన వచ్చేవరకు సమయమివ్వాలని తెలిపాడు. 

అలాగే రోహిత్‌ నుంచి అత్యద్భుత బ్యాటింగ్‌ ఆశించడం లేదని, అతడే తన అత్యుత్తమ ఆటను కనుగొనాలని కెప్టెన్‌ వివరించాడు. హిట్‌మ్యాన్‌ బాగా ఆడి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లడమే అతడి బలమని, గతంలో వీరూ భాయ్‌ ఎన్నో ఏళ్లు టీమిండియాకు ఇదే పనిచేశాడని గుర్తు చేశాడు. ఎవరో చెబితే సెహ్వాగ్‌ దూకుడుగా ఆడి శతకం బాదలేదని, అది అతడి సహజసిద్ధమైన బ్యాటింగ్‌ అని కోహ్లీ స్పష్టంచేశాడు. రోహిత్‌కు అలా ఆడే సామర్థ్యముందని చెప్పిన కెప్టెన్‌ పరిస్థితులకు అనుగుణంగా కూడా ఆడతాడన్నాడు. ముంబయి బ్యాట్స్‌మన్‌ను ఎప్పటినుంచో టెస్టు్ల్లో ఓపెనర్‌గా తీసుకురావాలని భావించినా అది ఇప్పుడే కుదిరిందని, పుజారా ఫామ్‌ కోల్పోయిన సందర్భంగా ఇలా అవకాశమొచ్చిందని వివరించాడు.

హిట్‌మ్యాన్‌ ఇదివరకు వన్డేల్లో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడేవాడని, అనుకోకుండా అతడిని ఓపెనర్‌గా దించాలనే చర్చ వచ్చాక, ఆ తర్వాత ఎనిమిది నెలల్లో ఓపెనర్‌గా మారాడని  తెలిపాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చెలరేగినట్టు టెస్టుల్లో రాణిస్తే, అది జట్టుకెంతో మంచిదన్నాడు. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కొనసాగుతున్నందున.. హిట్‌మ్యాన్‌ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అలాగే జట్టులో అందరికీ అవకాశమొస్తుందని.. మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌ లాంటి ఆటగాళ్లకి అవకాశమిచ్చామని తెలిపాడు. ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా సరైన సమయంలో అవకాశాలు వస్తాయని కెప్టెన్‌ పేర్కొన్నాడు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.