close

తాజా వార్తలు

విభజన రాజకీయాలు సాగవ్‌: మమత

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో విభజన రాజకీయాలు పనిచేయవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యాఖ్యానించారు. ఎన్‌ఆర్‌సీపై కేంద్రహోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు ఆమె బదులిచ్చారు. మంగళవారం కోల్‌కతాలో దుర్గా పూజా కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌షా.. తన ప్రసంగంలో విదేశీ అక్రమ వలసదారులను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఓ పూజా కార్యక్రమానికి హాజరైన మమత.. షా వ్యాఖ్యలపై స్పందిస్తూ ఘాటుగా విమర్శించారు. ‘మా రాష్ట్రానికి వచ్చి మా ప్రజల ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని నేను ప్రతిఒక్కరినీ ఆహ్వానిస్తున్నా. అంతేకానీ విభజన రాజకీయాలు చేస్తే మాత్రం  ఇక్కడ పనిచేయవు. దయచేసి మతాల వారీగా విభజన రాజకీయాలు చేస్తూ.. ప్రజల్లో చీలికలు సృష్టించకండి. కొన్ని వందల ఏళ్లుగా బెంగాల్‌ వివిధ విశ్వాసాలు ఉన్న నాయకులను గౌరవిస్తోంది. దాన్ని నాశనం చేయొద్దు’ అని మమత హితవు పలికారు. 

కేంద్ర హోంమంత్రి మంగళవారం కోల్‌కతా దుర్గా పూజా కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పౌర పట్టికను (ఎన్‌ఆర్‌సీ) దేశమంతా రూపొందిస్తామని, చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్నవారిని తరిమే వరకూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. ఎన్‌ఆర్‌సీని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించినా భాజపా దాన్ని అమలు చేసి తీరుతుందని ఉద్ఘాటించారు. బెంగాల్‌లో ఉంటున్న విదేశీయుల ఓటు బ్యాంకు టీఎంసీకి అనుకూలంగా ఉన్నందునే వారి ఏరివేతపై మమతా బెనర్జీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉండగా విదేశీయుల్ని తీవ్రంగా వ్యతిరేకించిన మమత ఇప్పుడు వారిని సమర్థిస్తున్నారని మండిపడ్డారు. ఆ సమయంలో వారంతా కమ్యూనిస్టుల పక్షాన నిలబడ్డారని, ఇప్పుడు టీఎంసీకి ఓటు బ్యాంకుగా మారినందువల్ల మమత వైఖరి మారిందని దుయ్యబట్టారు. అమిత్‌షా చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మమత స్పందిస్తూ ఆయనకు కౌంటర్‌ ఇచ్చారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.