
తాజా వార్తలు
ఉర్వీ సర్వ జయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్ మోక్షకరీ సదా శుభకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ।।
విజయవాడ: దసరాశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవిని నాలుగో రోజు శ్రీఅన్నాపూర్ణాదేవిగా అలంకరించారు. చేతిలో రసపాత్రను ధరించి, పరమేశ్వరునికి భిక్ష పెడుతున్న భంగిమలో అన్నపూర్ణాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. సకల చరాచరసృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతారు. ఈ రూపంలో ఆది పరాశక్తిని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, వాక్సిద్ధి, శుద్ధి కలుగుతాయి. మానవుడ్ని సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది. అమ్మ ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం. పరిపూర్ణమైన చిత్తంతో ఆరాధించిన వారి సమస్తపోషణా భారాన్ని ఈమె స్వయంగా వహిస్తుంది. ఓం శ్రీం హ్రీం క్లీం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా అనే మంత్రాన్ని జపించి అమ్మకు నివేదన చేయాలి. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పుష్పాలతో పూజించాలి. అన్నపూర్ణ స్తోత్రాలు చదవాలి. భోజనశాలలో ఈ తల్లి చిత్రపటం ఉంచి, హారతులు ఇవ్వాలి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
