close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. పాక్‌కు ఎదురుదెబ్బ..ఆ నగదు నిజాం వారసులకే..

హైదరాబాద్‌ నిజాంకు సంబంధించిన ఏడు దశాబ్దాల నాటి ఓ కేసులో భారత్‌కు ఊరట లభించింది. డెబ్భై ఏళ్ల క్రితం నిజాం బ్రిటన్‌కు తరలించిన ఒక మిలియన్‌ పౌండ్ల సొమ్ము (ఇప్పటి విలువ ప్రకారం 35 మిలియన్‌ పౌండ్లు) భారత్‌కే దక్కుతుందని హైకోర్ట్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ సంపదపై పాకిస్థాన్‌కు ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. లలితా జ్యువెలరీస్‌ దుకాణంలో భారీ చోరీ

తమిళనాడు తిరుచ్చిలోని లలితా జ్యువెలరీస్‌ దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణం వెనుక వైపు గోడకు పెద్ద రంద్రం చేసిన దొంగలు దుకాణంలోకి చొరబడి సుమారు 35కిలోల బంగారు, వజ్రాభరణాలు దోచుకెళ్లారు. అపహరణకు గురైన వజ్రాభరణాల ధర సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. ముసుగు ధరించి దుకాణంలోకి చొరబడిన ఇద్దరు దుండగులు ఆభరణాలు చోరీ చేసినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అంగన్‌వాడీలకు వేతనాలు విడుదల

అంగన్‌వాడీ ఉద్యోగులకు వేతనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వేతనాల కోసం రూ.83 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అంగన్‌వాడీ కార్యకర్తల బృందం మంగళవారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. విజయవాడకు 7.. హైదరాబాద్‌కు 17

దేశవ్యాప్తంగా స్వచ్ఛ రైల్వే స్టేషన్లలో విజయవాడ టాప్‌ టెన్‌లో స్థానం దక్కించుకుంది. దేశంలోని రైల్వే స్టేషన్ల స్వచ్ఛతపై నిర్వహించిన సర్వే నివేదికను రైల్వే శాఖ బుధవారం విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. జయపుర రైల్వే స్టేషన్‌కు ఒకటో ర్యాంకులో నిలిచింది. విజయవాడ రైల్వే స్టేషన్‌ ఏడో ర్యాంకు దక్కించుకోగా.. హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ 17వ ర్యాంకులో నిలిచింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ 42వ స్థానంలో నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కామ్రేడ్స్‌.. మాకు మద్దతివ్వండి: తెదేపా

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో తమకే మద్దతు ఇవ్వాలని తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సీపీఎం నేతలను కోరారు. హుజూర్ నగర్‌లో సీపీఎం అభ్యర్థి శేఖర్‌ రావు నామినేషన్‌ తిరస్కరణకు గురైన నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయికి మద్దతు ఇవ్వాలంటూ  ఆయన ఫోన్‌లో సీపీఎం నేతల్ని సంప్రదించారు. తమ నిర్ణయాన్ని గురువారం చెబుతామని ఆ పార్టీ నేతలు నేతలు చెప్పినట్టు తెదేపా నేత దుర్గాప్రసాద్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. గూగుల్‌ మ్యాప్స్‌లో  57 వేల శౌచాలయాల జాబితా!

మహాత్మాగాంధీ కలలు కన్న స్వచ్ఛ భారత కలను సాకారం చేసే దిశగా ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ మ్యాప్స్‌ మరో ముందడుగు వేసింది. జాతిపిత 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 2300 నగరాల్లో 57వేల శౌచాలయాల సమాచారాన్ని గూగుల్‌ మ్యాప్స్‌లో పొందుపరిచేందుకు జాబితా తయారు చేసింది. ప్రతినెల దాదాపు 2.5లక్షల మంది శౌచాలయాల కోసం గూగుల్‌లో వెతుకుతుండటంతో ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. పారదర్శకంగా ‘సచివాలయ’ నియామకాలు:బొత్స

గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందని ఎవరైనా నిరూపిస్తే ప్రభుత్వం తలదించుకొని ప్రజల ముందు మోకరిల్లుతుందని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన గంట్యాడ మండలం నరవ గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగాల నియామకానికి పూనుకొందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. బోటు కోసం గాలింపు.. కానరాని పురోగతి

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  మూడో రోజైన బుధవారం గాలింపు చేపట్టగా ఎలాంటి పురోగతి కానరాలేదు. కచ్చులూరు వద్ద బోటు వెలికితీత పనులను ఈరోజు కూడా ధర్మాడి సత్యం బృందం చేపట్టింది. ఇందులో భాగంగా ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు శ్రమించారు. ఎలాంటి ఆచూకీ లభ్యంకాకపోవడంతో మధ్యాహ్నం మరోసారి ప్రయత్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. మంగేష్కర్‌కు 2రోజుల్లో 56వేల ఫాలోవర్స్‌..!

ప్రముఖ గాయిని లతా మంగేష్కర్‌ వృద్ధాప్యంలోనూ అభిమానులకు అందుబాటులో ఉండేందుకు సాంకేతికతను బాగా ఉపయోగించుకుంటున్నారు. గతంలో ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాల్ని అభిమానులతో పంచుకున్న ఆమె తాజాగా ఫొటో వీడియో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఖాతా తెరిచి అభిమానులకు మరింత దగ్గరయ్యారు. మంగేష్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు రోజుల కింద ఖాతా ప్రారంభించగా అప్పుడే ఆమెను 56వేలకు పైగా అభిమానులు ఫాలో చేయడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మానవాళి మనుగడకే ప్రమాదకరంగా ‘ప్లాస్టిక్‌’


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.