close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. మధ్యప్రదేశ్‌లో బస్సు బోల్తా.. ఆరుగురి మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బుధవారం అర్ధరాత్రి రైసేన్‌లోని నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. 19 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. 

2.నేడు దిల్లీకి కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండ్రోజుల పర్యటన నిమిత్తం దిల్లీ వెళ్తున్నారు. గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి ఆయన బయలుదేరుతారు. శుక్రవారం ఉదయం 11.00 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించనున్నారు. ప్రధానిగా మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయనతో భేటీ కావడం ఇదే మొదటిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. వారంలో విద్యుత్‌ కోతలకు తెర

‘‘వారంలో కోతలు లేని విద్యుత్తు అందిస్తాం. బొగ్గు కొరతతో సమస్య ఏర్పడింది. విద్యుత్తు ఎక్స్ఛేంజీల నుంచి విద్యుత్‌ తీసుకుంటున్నాం’’ అని ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా మెరుగు కోసం తీసుకున్న చర్యలను ‘ఈనాడు’ ముఖాముఖిలో ఆయన వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. లలిత త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. నేడు దుర్గమ్మ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మల్లికార్జున మహామండపంలో ఆరో అంతస్తులో ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చన నిర్వహిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కోటిన్నర మందికి ఉచిత కళ్లజోళ్లు

కంటివెలుగు పథకం ద్వారా ఏపీలో సుమారు కోటిన్నర మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నారు. మరో ఎనిమిది లక్షల మందికి క్యాటరాక్ట్‌, ఇతర శస్త్ర చికిత్సలు జరుపుతారు. ఈ పథకం అమలు నిమిత్తం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మొత్తం రూ.560 కోట్లను కేటాయించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 2022 జనవరి 31వ తేదీ వరకు 6 దశల్లో కంటి వెలుగు కార్యక్రమాలు జరిగేలా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. సినిమా చూసి బుక్కైపోయారు!

క్రమశిక్షణను ఉల్లంఘించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ కర్నూలు జిల్లాలోని ఏడుగురు ఎస్సైలపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. వారంతా కోవెలకుంట్లలోని పాండురంగ థియేటర్‌లో బుధవారం తెల్లవారుజామున ‘సైరా నరసింహారెడ్డి’ బెనిఫిట్‌ షోకు వెళ్లారు. ఏడుగురు ఎస్సైలు తమ పైఅధికారులకు చెప్పకుండా తమస్టేషన్ల పరిధి దాటి వెళ్లడంతో వారిపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

7. నేటి నుంచి బ్యాంకుల రుణ మేళా

చిన్న ఖాతాదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు)కు రుణాలు కల్పించడం నేటి నుంచి బ్యాంకులు మొదటి దశ ‘రుణ మేళా’లను ప్రారంభించనున్నాయి. పండగల సీజన్‌ నేపథ్యంలో గిరాకీ అందుకునేందుకు దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో ఈ సేవలు అందించనున్నాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు రిటైల్‌, వ్యవసాయం, వాహన, గృహ, ఎంఎస్‌ఎంఈ, విద్య, వ్యక్తిగత విభాగాల్లో బ్యాంకులు రుణాలు మంజూరు చేయనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. స్వామివారికి డ్రైఫ్రూట్స్‌తో కిరీటాలు

9. ఆసియా దేశాలకు ఉల్లి ఘాటు

మన దేశం నుంచి ఉల్లిగడ్డల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో ఆసియాలోని అనేక దేశాల్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రత్యేకించి బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌, మలేసియా తదితర దేశాల్లోని మార్కెట్లలో ఉల్లి లభించడమే కష్టంగా మారింది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో కేజీ ఉల్లిపాయలు కొనాలంటే 120 టాకాలు చెల్లించాల్సి వస్తోంది. 15రోజుల క్రితం ఈ ధర 60టాకాలుగా ఉండేది. శ్రీలంకలోనూ కేజీ ఉల్లిగడ్డల ధర రూ.300కు (శ్రీలంక రూపాయిల్లో) చేరింది. 

10. గూగుల్‌ మ్యాప్స్‌లో మరుగుదొడ్ల వివరాలు

హమ్మయ్య! పెద్ద సమస్యే తీరింది. ఎక్కడికన్నా బయటకు వెళ్లామంటే మరుగుదొడ్లు ఎక్కడుంటాయో తెలియదు. వాటి గురించి ఎవర్నయినా అడుగుదామన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా 2,300 పట్టణాల్లో ఉన్న 57,000 పబ్లిక్‌ టాయ్‌లెట్ల వివరాలను గూగుల్‌ మ్యాప్స్‌ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్‌ మ్యాప్స్‌, గూగుల్‌ సెర్చ్‌ లేదంటే గూగుల్‌ అసిస్టెంట్‌లో ‘పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌ నియర్‌ మీ’ అని వెతికితే వాటి వివరాలు ప్రత్యక్షమవుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.