close

తాజా వార్తలు

విశాఖ టెస్టు: మయాంక్‌ శతకం

విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (100; 204 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకం బాదాడు. కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తిచేశాడు. విదేశాల్లో, స్వదేశంలో తొలి ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేసిన ఆటగాడిగా మయాంక్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రోహిత్‌ (136*)తో కలిసి సఫారీ బౌలర్లును దీటుగా ఎదుర్కొంటున్నాడు. చెత్త బంతుల్ని బౌండరీకి తరలిస్తూ పరుగులు రాబట్టుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌-మయాంక్‌ అరుదైన రికార్డు సాధించారు. దక్షిణాఫ్రికాపై తొలి వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడీగా రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు సెహ్వాగ్‌-గంభీర్‌ (218) పేరిట ఉండేది. రెండో రోజు 202/0తో ఆటను ప్రారంభించిన భారత్ ప్రస్తుతం వికెట్‌ నష్టపోకుండా 241 పరుగులు చేసింది. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.