close

తాజా వార్తలు

వాహనమిత్ర పథకం ప్రారంభించిన జగన్‌

ఏలూరు: రాష్ట్రంలోని ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ‘వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ..2018 మే 14న  పాదయాత్రలో ఇచ్చిన మాటను నెరవేర్చుతున్నానని చెప్పారు. ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం కింద రూ.10వేలు పంపిణీ కార్యక్రమం చేపట్టామని, ఆటో డ్రైవర్ల కోసం గతంలో ఏలూరులోనే ఈ ప్రకటన చేశానని గుర్తు చేశారు. ఇవాళ కూడా ఏలూరు నుంచే ఆర్థిక సాయం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ‘ వాహనమిత్ర ద్వారా డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తున్నా. నా పాదయాత్రలో ఆటో కార్మికుల కష్టాలను కళ్లారా చూసి చలించిపోయాను. అందువల్ల వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చా’ అని అన్నారు. అంతకు ముందు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన వైద్య కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.