
తాజా వార్తలు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వైకాపా ప్రభుత్వం సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తోందని తెలిపారు.
మరోవైపు ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు రెండు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. మూలానక్షత్రం కారణంగా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సాయంత్రం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- శరణార్థులకు పౌరసత్వం
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
