
తాజా వార్తలు
దిల్లీ: చిన్నారులు బొద్దుగా, ముద్దుగా ఉన్నారని ముచ్చట పడిపోతున్నారా? వారిలో ఊబకాయం అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాకుండా అది ఒక వ్యాధిలాంటిదని ప్రపంచ ఒబెసిటీ ఫెడరేషన్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ‘పిల్లల్లో స్థూలకాయం’ అనే అంశంపై ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. పిల్లల్లో స్థూలకాయం 2010-12 నాటి లెక్కలతో పోల్చినప్పుడు 2025 నాటికి పెరగలేదని నిర్ధరించుకోవడానికి 2013లో జరిగిన ప్రపంచ హెల్త్ అసెంబ్లీ సదస్సులో పలు దేశాలు అంగీకరించాయి. అందులో పిల్లల్లో స్థూలకాయాన్ని కనీసం 50 శాతానికి తగ్గించాలన్న లక్ష్యాన్ని ప్రపంచంలో ఏ దేశమూ చేరుకోలేకపోతోందని ఫెడరేషన్ తెలిపింది.
196 దేశాల్లో తాజా అంచనా ప్రకారం 156 దేశాలు తమ లక్ష్యాలను చేరుకొనే అవకాశం 10 శాతం కన్నా తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. 2020 కల్లా ప్రపంచంలో 158 మిలియన్ల మంది ఊబకాయులైన పిల్లలు ఉండనున్నారని, ఈ సంఖ్య 2025 నాటికి 206 మిలియన్లకు, 2030 నాటికి 254 మిలియన్లకు చేరనుందని పేర్కొంది.
రెండో స్థానంలో భారత్
ఇప్పటికీ పిల్లల్లో పోషకాహార లోపం ఉన్న భారత్‌లోనూ చిన్నారుల్లో ఒబెసిటీ పరిస్థితులు కొంత తీవ్రంగానే ఉండనున్నాయి. 2030 నాటికి చైనా తర్వాత భారత్‌లోనే అత్యధిక మంది స్థూలకాయులైన పిల్లలు ఉండనున్నారు. ఆ సమయానికి భారత్‌లో 27 మిలియన్ల మంది ఉంటారని అంచనా. దీని తర్వాత అమెరికాలో 17 మిలియన్ల మందితో మూడో స్థానంలో ఉండనుంది. 62 మిలియన్ల మంది స్థూలకాయులైన చిన్నారులతో మొదటి స్థానంలో చైనా నిలవనుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
