
తాజా వార్తలు
మోదీ హయాంలో ఇదే అత్యల్పం
దిల్లీ: ఆర్థిక వ్యవస్థపై వినియోగదారుల విశ్వాసం ఆరేళ్ల కనిష్ఠానికి చేరుకుంది. ఆర్బీఐ నివేదిక ఒకటి ఈ విషయాన్ని వెల్లడించింది. ‘వినియోగదారుల విశ్వాస సూచీ’ సర్వే ఫలితాలు ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశంలో వెల్లడించింది. ప్రముఖ నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 5వేల మంది పాల్గొన్నారు. ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ కల్పన, ధరలు, ఆదాయం, ఖర్చుల ఆధారంగా వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి వాటి ఆధారంగా ప్రస్తుత, భవిష్యత్ అంచనాలను రూపొందించారు.
2019 సెప్టెంబర్లో ‘ప్రస్తుత పరిస్థితుల సూచీ’ 89.4కు చేరుకుంది. మోదీ ప్రభుత్వ హయాంలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో 2013 సెప్టెంబర్లో ఈ సూచీ 88గా ఉండేది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 2014 సెప్టెంబర్లో వినియోగదారుల విశ్వాస సూచీ 103.1గా ఉండేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ సూచీ కాస్త తగ్గినప్పటికీ 2019 మార్చి నాటికి మళ్లీ 104.6 పాయింట్లకు చేరింది. జులై వచ్చేటప్పటికి 95.7 చేరుకున్న సూచీ.. సెప్టెంబర్ నాటికి 89.4కు చేరుకోవడం గమనార్హం. వినియోగదారుల భవిష్యత్ అంచనాలు 2019 జులైలో 124.8గా ఉండగా.. సెప్టెంబర్ నాటికి అది 118కి పడిపోవడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఉద్యోగాల కల్పన కారణాల వల్ల కొద్దిరోజులుగా ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు ఆర్బీఐ నివేదిక చెబుతోంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్కౌంటర్తో న్యాయం జరగలేదు
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్కౌంటర్పై హైకోర్టులో అత్యవసర విచారణ
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆ రెండు రోజులూ ఏం జరిగింది?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
