close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, వేతన సవరణ, ఉద్యోగ భద్రత తదితర 26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పోలీసుల భద్రత నడుమ బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో మెట్రోలో అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఈ సమయంలో సమ్మెలా!

ఆర్టీసీ సమ్మె జరిగితే  కఠినంగానే వ్యవహరించాలని, క్రమశిక్షణ కాపాడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా వచ్చే ఆదాయం ఆర్టీసీకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని, ఈ సమయంలోనే సంస్థకు నష్టం తెచ్చే విధంగా సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం ఏమిటి? అని సీఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తంచేశారు. శనివారం సాయంత్రం 6 గంటల లోపు ఆయా డిపోల్లో విధుల్లో చేరిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆ సమయంలోగా విధుల్లో చేరని వారిని ‘‘తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా’’ గుర్తించాలని ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

3. నేడు దిల్లీకి ముఖ్యమంత్రి జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 9:30గంటలకు దిల్లీ బయలుదేరుతున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో ఆయన అపాయింట్‌మెంట్‌ ఖరారైనట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు కొందరు కేంద్రమంత్రులనూ ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. విద్యుత్‌ బస్సులకు రివర్స్‌ టెండర్‌

గత ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకే కాకుండా... తమ ఆధ్వర్యంలో పిలిచిన టెండర్లకూ ఏపీ సర్కారు రివర్స్‌ టెండర్లకు వెళ్తోంది. అందులో భాగంగా ఏపీఎస్‌ఆర్టీసీలో తొలి విడతగా లీజు రూపంలో తీసుకోనున్న విద్యుత్‌ బస్సులకు వచ్చే నెల 6న రివర్స్‌ టెండరు నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. సరస్వతీదేవిగా దుర్గమ్మ

శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవికి చేసే అలంకారాలన్నింటిలో మూలా నక్షత్రం రోజున చేసే సరస్వతీదేవి అలంకారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సరస్వతీదేవి పుట్టిన నక్షత్రం మూల. సాధారణంగా నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజున మూలా నక్షత్రం వస్తుంది. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు... మొదలైన అన్ని విద్యలకు ఈ తల్లి అధిష్ఠాన దేవత. చేతిలో కచ్ఛపి అనే బంగారు వీణను ధరించి, నెమలి వాహనాన్ని అధిరోహించి ఉంటుంది. ఈమెను విజ్ఞానదేవతగా శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. మూడు కి.మీ.లకో ఛార్జింగ్‌ స్టేషన్‌

దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగం పెంపు దిశగా కేంద్రప్రభుత్వం శుక్రవారం తాజా చర్యలను ప్రకటించింది. వాటి ఛార్జింగ్‌కు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘ఇల్లు, కార్యాలయాల్లో ప్రైవేటు ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యుత్తు పంపిణీ సంస్థలు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లకు లైసెన్సులు అవసరం లేదు’ అని మార్గదర్శకాల్లో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ‘అయోధ్య’ కేసులో 17 నాటికివిచారణ ముగింపు

‘అయోధ్య’ స్థల వివాదం కేసు విచారణను అక్టోబరు 17వ తేదీ నాటికల్లా ముగించేయనున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. గతంలో నిర్ధారించినట్లుగా అక్టోబరు 18న కాకుండా ఒక రోజు ముందే విచారణను పరిసమాప్తం చేయాలని తాజాగా నిర్ణయించింది. కీలకమైన ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి సారథ్యంలోని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం రోజువారీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మళ్లీ ప్రత్యక్షరాజకీయాల్లోకి ముషారఫ్‌

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ సైన్యాధిపతి జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ మళ్లీ రాజకీయ రానున్నారు. తాను స్థాపించిన పార్టీ ఆల్‌ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (ఏఎంపీఎల్‌) 9వ వార్షికోత్సవం రోజైన అక్టోబరు 6న ఆయన రాజకీయ పునఃప్రవేశ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉంటుందని పర్వేజ్‌ సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. త్వరలోనే ముషారఫ్‌ ముఖ్యమైన రాజకీయ ప్రకటనలు కూడా చేయనున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మొక్కలూ మాట్లాడుకుంటాయ్‌!

మొక్కలు తమదైన ప్రత్యేక భాషలో సంప్రదించుకుంటాయని, పరస్పరం బాధలను పంచుకుంటాయని పరిశోధకులు గుర్తించారు. తమ మనుగడకు ముప్పు కలిగించే అంశాలపై హెచ్చరికలు చేసుకుంటాయని కూడా నిర్ధారించారు. అమెరికా ఈశాన్య ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ‘సొలిడగో అల్టిస్సిమా’ జాతి మొక్కలపై అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కూడిన బృందం తాజాగా పరిశోధనలు నిర్వహించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ముంబయి మురిసె..

బాస్కెట్‌బాల్‌ ప్రియుల ఫేవరెట్‌ టోర్నీ నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) లీగ్‌ భారత్‌లో అడుగుపెట్టింది. ముంబయి వేదికగా నిర్వహిస్తున్న రెండు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల్లో ఒకటి శుక్రవారం పూర్తయింది. కిక్కిరిసిన స్టేడియంలో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇండియానా పేసర్స్‌ 132-131 తేడాతో శాక్రమెంటో కింగ్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయానికి స్కోరు 118-118తో సమం కాగా.. అదనంగా 5 నిమిషాల సమయం ఇచ్చారు. అందులోనూ ఇరు జట్లూ నువ్వానేనా అన్నట్లు తలపడగా.. చివరికి పేసర్స్‌ పైచేయి సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.