close

తాజా వార్తలు

బుమ్రాతో పెట్టుకోవద్దు: కేఎల్‌ రాహల్‌

సహచరులను కూడా వదిలిపెట్టడు 

దిల్లీ: టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాతో పెట్టుకోవద్దని, ఆఫ్‌ఫీల్డ్‌లో అతడు సహచరులను కూడా వదలడని సహచర ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు ఇద్దరూ దూరమవ్వగా ఓ క్రీడా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వెన్నునొప్పి గాయంతో బుమ్రా రెండు నెలలు ఆటకు దూరమైన విషయం తెలిసిందే. అలాగే కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతుండగా టీమిండియా అతడిని తప్పించి రోహిత్‌శర్మకు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చింది. రాహుల్‌ మాట్లాడుతూ ‘బుమ్రా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఆటగాడు. సహచరులతో ఆడేటప్పుడు కూడా అతడికి జాలి, దయ ఉండవు. ఎప్పుడూ పోటీపడి ఆడతాడు. ఇప్పుడు భారత జట్టుకు బుమ్రా అందిస్తున్న సేవలు అత్యద్భుతం. భవిష్యత్‌లో మరింతగా రాణిస్తాడనే నమ్మకం ఉంది’ అని రాహుల్‌ వివరించాడు. 

ఇదిలా ఉండగా ఆసీస్‌ బౌలర్లు పాట్‌ కమిన్స్‌, నాథన్‌ లయన్‌తో పాటు అఫ్గాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ను ఎదుర్కోవడం తనకు కష్టమని కర్ణాటక బ్యాట్స్‌మన్‌ చెప్పుకొచ్చాడు‌. ‘ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో కమిన్స్‌ అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతడిని ఎదుర్కోవడం నాకు చాలా కష్టం. అలాగే రషీద్‌ఖాన్‌ నాపై ఎప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తాడు. అతడి బౌలింగ్‌లో కొన్నిసార్లు ఔటయ్యాను. ఈ ముగ్గురితో పాటు బుమ్రా కూడా అత్యుత్తమ బౌలర్‌’ అని రాహుల్‌ పేర్కొన్నాడు. అలాగే ఇంగ్లాండ్‌ ప్లేయర్‌ బెన్‌స్టోక్స్‌ని ఐపీఎల్‌లో తమ జట్టు(పంజాబ్‌)లో తీసుకోవడానికి ఇష్టమేనని చెప్పాడు. ‘స్టోక్స్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ బాగా చేయగలడు. అతడు ఆడిన జట్లు అన్నింటిపై మంచి ప్రదర్శన చేశాడు. కాబట్టి అతడు మా జట్టులో ఉండాలని కోరుకుంటా’ అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కర్ణాటక జట్టు తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ ఆడుతున్న టీమిండియా బ్యాట్స్‌మన్‌ అక్కడ మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక శతకం, అర్ధశతకం సాధించడం విశేషం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.