close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1.  బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు తలొగ్గం:కేసీఆర్‌

తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్లేందుకు, సంస్థ మనుగడకు కొన్ని చర్యలు తప్పవని సీఎం అన్నారు. ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చట్ట విరుద్ధంగా.. అదీ పండుగుల సీజన్లో సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీపడే సమస్యే లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై నిర్వహించిన సుదీర్ఘ ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం సీఎం కార్యాలయం ప్రకటన వెలువరించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని కేసీఆర్‌ తేల్చిచెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున మహిళలు ఈ సంబురాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌ వద్ద వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు బతుకమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆర్టీసీ సమ్మెపై విచారణ వాయిదా

ఆర్టీసీ సమ్మెపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి.. రెండు గుర్తింపు సంఘాలకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అక్టోబరు 14 నుంచి బడ్జెట్‌ కసరత్తులు ప్రారంభం!

వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2020-21) సంబంధించిన వార్షిక బడ్జెట్‌ కసరత్తులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ త్వరలో ప్రారంభించనుంది. నెమ్మదించిన వృద్ధిరేటు సహా అనేక సమస్యలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలను తయారు చేయనుంది. ఈ ప్రక్రియ అక్టోబరు 14నుంచి ప్రారంభమవుతుందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. మోదీ 2.0 ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండోసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ ఇది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సమ్మెను ఉద్ధృతం చేస్తాం: అశ్వత్థామరెడ్డి

సుమారు 50వేల మంది కార్మికులు పూర్తిస్థాయిలో పాల్గొంటుంటే సమ్మె పాక్షికమే అంటూ కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించడం సరికాదని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మెపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలిశామని.. వారంతా తమకు మద్దతు ప్రకటించారని చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నిజాలు బయటపెడితే వేధిస్తారా?:లోకేశ్‌

గోదావరి బోటు ప్రమాదం వెనుక ఉన్న నిజాలను బయట పెట్టినందుకు దళిత నాయకుడు, మాజీ ఎంపీ హర్ష కుమార్‌ను కేసుల పేరుతో వేధిస్తారా?సిగ్గుగా లేదా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. గోదావరిలో 144 సెక్షన్ పెట్టారు  కానీ, బోటును తీయలేరా? అంటూ ఎద్దేవా చేశారు. ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జగన్‌ సర్కారుపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు

గ్రామాల్లో ఉపాధిహామీ పథకం పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందని తెదేపా ఆందోళన వ్యక్తం చేసింది. మోదీ సర్కారు నిధులు మంజూరు చేసినా వాటిని ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తూ పక్కదారి పట్టిస్తోందంటూ జగన్‌ సర్కారుపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యురేనియం బాధితులతో అఖిలపక్షం భేటీ

కడప జిల్లా వేముల మండలంలోని యురేనియం కర్మాగారం ప్రభావిత ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం అఖిలపక్ష నేతలు పర్యటించారు. కర్మాగారం నుంచి వెలువడే కాలుష్యం కారణంగా ఇబ్బంది పడుతున్న కె.కె.కొట్టాల గ్రామస్థులతో అఖిలపక్షం సమావేశమైంది. తెదేపాకు చెందిన మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం, జనసేన నాయకులు గ్రామస్థులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫ్రాన్స్‌లో రాజ్‌నాథ్‌ ఆయుధ పూజ..!

భారత ప్రభుత్వ ఆయుధ పూజ ఈ సారి ఫ్రాన్స్‌లో జరగనుంది. సంప్రదాయం ప్రకారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ పూజ నిర్వహించనున్నారు. ఆయన అక్టోబర్‌ 8వ తేదీన ఫ్రాన్స్‌లో తొలి రఫేల్‌ను అందుకోనున్నారు. దీనిలో భాగంగా అదే రోజు అక్కడ శస్త్రపూజను నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పాయింట్ల పట్టికలో కోహ్లీసేన దూకుడు

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. 203 పరుగుల తేడాతో సఫారీలను చిత్తుచేసింది. ఈ పోరులో కోహ్లీసేన అన్ని విభాగాల్లో అదరగొట్టింది. ఈ విజయంతో భారత్‌ ఖాతాలో 40 పాయింట్లు జతకావడంతో పట్టికలో కోహ్లీసేన ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. అంతకుముందు టీమిండియా 120 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. ఇప్పుడు 40 పాయింట్లు రావడంతో మొత్తం 160తో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.