close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9AM

1. కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. మూడో రోజు కూడా ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తామని ఆర్టీసీ సంఘాలు స్పష్టం చేశాయి. ఇది ఇలా ఉండగా.. ఆర్టీసీని విలీనం చేసేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మహిషాసురమర్దని అవతారంలో దుర్గమ్మ

శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదోరోజు సోమవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవిని మహిషాసురమర్దనిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిషుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు జగన్మాతకు మహిషాసురమర్దని అనే పేరు ఏర్పడింది. సింహవాహనాన్ని అధిరోహించి, చేతిలో త్రిశూలం ధరించి ఉగ్రరూపంతో ఈ తల్లి దర్శనమిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. పూలవనంలా తెలంగాణ

తెలంగాణలో పూల పండుగ బతుకమ్మ ఘనంగా ముగిసింది. ఆనందోత్సవాలు, భక్తిశ్రద్ధలతో పూజించిన గౌరమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు. మహాలయ అమావాస్యతో ప్రారంభమై  వైభవంగా సాగిన పండుగలో చివరి రోజైన ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. హైదరాబాద్‌లో సంబురాలు అంబరాన్నంటాయి. వర్షం ఆటంకాలు కల్పించినా మహిళలు తరగని ఉత్సాహంతో వేడుకల్లో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం

ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. స్థిరాస్తి రంగంలో స్తబ్ధతతో రాష్ట్రవ్యాప్తంగా గతేడాదితో పోల్చితే రిజిస్ట్రేషన్లు 4.21% తగ్గాయి. గత ఏప్రిల్‌ నుంచి కిందటి నెల వరకు 8,56,355 దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కిందటేడు ఇదే సమయానికి 8,94,003 రిజిస్ట్రేషన్లు నమోదవడం గమనార్హం. గుంటూరు జిల్లాలో 15.94% తగ్గగా.. కడప జిల్లాలో 10.28% వృద్ధి నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ‘ప్రైవేటు’ దోపిడీపై దాడులు

దసరా పండగ, తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు బస్సుల్లో ప్ర్రయాణికుల నుంచి ఎక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేయడంపై ఏపీ రవాణాశాఖ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో వరుసగా దాడులు నిర్వహిస్తోంది. పలు బస్సులపై కేసులూ నమోదు చేసింది. అధిక ఛార్జీలపై దాడులను దసరా సెలవుల ముగింపు సమయం వరకేగాకుండా దీపావళి వరకూ కొనసాగిస్తామని రవాణాశాఖ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. వరదనీటిలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన యువకుడు

7. స్వదేశంలోనే విదేశీ చదువు

విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనే ఆ వర్సిటీల ప్రాంగణాలను ఏర్పాటు చేయించడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. విపక్షంగా ఉన్నప్పుడు భాజపా ఈ విధానాన్ని వ్యతిరేకించింది. దీనిని పక్కనపెట్టి... విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు తమ ప్రాంగణాలను (ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లను) మన వద్ద తెరవడానికి మానవ వనరుల అభివృద్ధి (హెచ్చార్డీ) మంత్రిత్వశాఖ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. హ్యాకర్ల చేతుల్లో ఫోన్‌!

పలు మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల గోప్యతకు ముప్పు కలిగిస్తున్న బగ్‌ ఒకటి తాజాగా బయటపడింది. పాత ఆండ్రాయిడ్‌ కెర్నెల్‌ వెర్షన్లను బగ్‌ ప్రభావితం చేస్తున్నట్లు గూగుల్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇంటర్నెట్‌ ద్వారా అది ఫోన్‌లోకి చేరితే.. హ్యాకర్లు ఎక్కడి నుంచైనా సరే ఫోన్‌లోని సమాచారాన్ని తస్కరించగలుగుతారని తెలిపారు. గూగుల్‌ పిక్సల్‌ 1, 1ఎక్స్‌ఎల్‌, 2, 2ఎక్స్‌ఎల్‌, హువావె పీ20, మోటో జడ్‌3, ఒప్పో ఏ3, షియోమికి చెందిన రెడ్‌మీ 5ఏ, రెడ్‌మీ నోట్‌5, ఎంఐ ఎ1 ఫోన్లలో బగ్‌ ఉనికిని తాను గుర్తించినట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఫ్రాన్స్‌లో రాజ్‌నాథ్‌ ఆయుధ పూజ..!

భారత ప్రభుత్వ ఆయుధ పూజ ఈ సారి ఫ్రాన్స్‌లో జరగనుంది. సంప్రదాయం ప్రకారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ పూజ నిర్వహించనున్నారు. ఆయన అక్టోబర్‌ 8వ తేదీన ఫ్రాన్స్‌లో తొలి రఫేల్‌ను అందుకోనున్నారు. దీనిలో భాగంగా అదే రోజు అక్కడ శస్త్రపూజను నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్‌

ప్రపంచ అథ్లెటిక్స్‌ క్రీడలు ముగిశాయి. ఈ క్రీడాపోటీల్లో 14 స్వర్ణాలు సహా మొత్తం 29 పతకాలతో అమెరికా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. కెన్యా 5 స్వర్ణాలు సహా 11 పతకాలతో రెండో స్థానంలో నిలవగా.. జమైకా 3 పసిడి పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. భారత జట్టు రిక్తహస్తాలతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ను ముగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.