
తాజా వార్తలు
ముంబయి: ఏదో ఒకరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కచ్చితంగా శివసేన నుంచే ఉంటారని ఆ పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే అన్నారు. తన తనయుడు ఆదిత్య ఠాక్రే సీఎం అయ్యే అవకాశాల్ని గతంలో సున్నితంగా తిరస్కరించిన ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు మిత్రపక్షం భాజపా సైతం తదుపరి సీఎం తమ పార్టీ నుంచే ఉంటారని ప్రకటించేశారు. తిరిగి భాజపానే అధికారంలోకి వస్తుందని.. తానే రెండోసారి పగ్గాలు చేపడతానని ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఉద్దవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శివసేన అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తానని తన తండ్రి దివంగత నేత బాల్ ఠాక్రేకు హామీ ఇచ్చానని పార్టీ అధికారిక పత్రిక సామ్నాకి ఇచ్చిన ముఖాముఖిలో ఉద్దవ్ తెలిపారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరిగి తీరుతుందన్నారు. ఆ దిశగానే పార్టీ శ్రమిస్తోందని తెలిపారు. అయితే తనయుడు రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన తాను తప్పుకుంటున్నట్లు కాదని తెలిపారు.
తన తనయుడు ఆదిత్య సీఎం అభ్యర్థి కాదని ఇటీవల ఫడణవీస్‌తో కలిసి జరిపిన మీడియా సమావేశంలో ఉద్దవ్ ప్రకటించారు. తాజాగా ఏదోఒకరోజు శివసేన నుంచి ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడంతో రాష్ట్రంలో ఊహాగానాలు ఊపందుకొన్నాయి. మరోవైపు పార్టీలోనూ ఆదిత్య ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తీవ్రంగా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఆదిత్య వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా ఎన్నికల్లో భాజపా, శివసేన మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. భాజపా 150 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. శివసేన 124 స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఇప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా.. 24న ఫలితాలు వెలువడనున్నాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
