close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. రాజరాజేశ్వరీదేవి అవతారంలో దుర్గమ్మ 

శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరిరోజైన విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని... ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గాదేవిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారు. రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమి పర్వదినాన్ని చేసుకోవడం ఆనవాయితీగా ఏర్పడింది. రాజరాజేశ్వరీదేవిని అపరాజితాదేవి అనీ పిలుస్తారు. అన్ని లోకాలకు ఈమె ఆరాధ్య దేవత. దేవతలందరి సమష్ఠి స్వరూపంగా జ్యోతి స్వరూపంతో ప్రకాశిస్తూ పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పుర సేవలకు కాల్‌సెంటర్‌

తెలంగాణ రాష్ట్రంలో పురపాలక శాఖ అందించే సేవలపై ప్రజల సందేహాల నివృత్తికి ప్రత్యేక కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆ శాఖ మంత్రి కె. తారకరామారావు అధికారులను ఆదేశించారు. నూతన పురపాలక చట్టం తెచ్చిన నేపథ్యంలో ఈ సూచన చేశారు. ప్రతి పట్టణానికి బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) రూపొందించాలన్నారు. కేటీఆర్‌ సోమవారం పురపాలకశాఖ కార్యాలయంలో పుర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. అప్పిస్తే తీర్చగలరా?

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఆర్థిక సంస్థ లిమిటెడ్‌కు (ఏపీపీఎఫ్‌సీఎల్‌) అప్పు పుట్టడం కష్టంగానే ఉంది. రుణానికి గ్యారంటీ ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతున్నా ప్రభుత్వరంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అసలు అప్పును ఎలా తీర్చగలరంటూ సందేహాలను లేవనెత్తుతోంది. ‘అసలు మీకు అప్పిస్తే తీర్చగలిగే శక్తి ఉందా? ఇప్పటికే తీసుకున్న అప్పుల ద్వారా ఏమైనా సంపాదిస్తున్నారా’ అంటూ ఏపీపీఎఫ్‌సీఎల్‌ను సూటిగా ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. కొత్త జిల్లాలు ఏర్పడి దసరాకు మూడేళ్లు

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండల కార్యాలయాల్లో కనీస వసతులు లేక ప్రజలు, అధికారులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో 2016 దసరా రోజున 21 కొత్త జిల్లాలను, ఈ ఏడాది మరో రెండు జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరిపాలన వికేంద్రీకరణ బాగున్నా కార్యాలయాల భవనాలు, కొత్తగా సిబ్బంది నియామకాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఇరుకు గదులు, ఒకే భవనంలో రెండు, మూడు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు సర్దుకుపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. స్విస్‌ ఖాతాల తొలి కబురు

విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం వెలికితీత దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. నూతనంగా కుదిరిన ‘ఆటోమేటిక్‌ సమాచార మార్పిడి ఒప్పందం’ (ఏఈఓఐ) కింద స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలతో తొలి సమాచారాన్ని స్విట్జర్లాండ్‌ పంపించింది. క్రియాశీలంగా ఉన్న ఖాతాల వివరాలతో పాటు 2018లో మూతపడిన ఖాతాల సమాచారాన్నీ స్విస్‌ ప్రభుత్వం పంపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. యురేనియం అన్వేషణ ఎప్పుడూ చేయలేదు: జీఎస్‌ఐ

తెలంగాణ రాష్ట్రం సహా భారతదేశంలో ఎక్కడా భూ వైజ్ఞానిక సర్వేక్షణ సంస్థ (జీఎస్‌ఐ) యురేనియం నిక్షేపాల అన్వేషణ చేయలేదని సంస్థ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రీధర్‌ స్పష్టం చేశారు. యురేనియం సహా ఏ ఇతర ఆటమిక్‌ మినరల్స్‌ నిక్షేపాల అన్వేషణలో జీఎస్‌ఐ పాలుపంచుకోలేదని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. నోటి ఆరోగ్య పరిరక్షణకు.. ‘ఈ-దంత్‌సేవ’

నోటి ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన పెంచేందుకు ‘ఈ-దంత్‌సేవ’ పేరుతో రూపొందించిన వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ సోమవారం ప్రారంభించారు. ఒక్క క్లిక్‌తో నోటి ఆరోగ్యం గురించి సమస్త సమాచారం తెలిపేందుకు వీలుగా దీన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ‘ఆరే’లో పనులు కొనసాగిస్తాం: మెట్రో

ముంబయిలోని ఆరే కాలనీలో చెట్ల నరికివేతపై సోమవారం అత్యవసర విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు నరికివేతను నిలిపివేయాలంటూ మెట్రో సంస్థను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి మేం భవిష్యత్‌లో ఎలాంటి చెట్ల నరికివేతనూ చేపట్టబోం. ఇప్పటికే శుక్ర, శనివారాల్లో తొలగించిన 2,141 చెట్ల స్థానంలో మాత్రం కార్ల షెడ్డు భవన నిర్మాణ పనులను అనుకున్న విధంగా చేపడతాం’’ అని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. వాహన చట్టం అతిక్రమించినవారిపై ఐపీసీ కిందా కేసు పెట్టవచ్చు

మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా దురుసుగా వాహనాలు నడపడం ద్వారా మోటారువాహనాల(ఎంవీయాక్ట్‌) చట్టం కింద నేరానికి పాల్పడిన వ్యక్తిపై ‘భారత శిక్షాస్మృతి’ కింద కూడా కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు సోమవారం ఉద్ఘాటించింది. ఈ రెండు శాసనాలు వాటి స్వతంత్ర పరిధుల్లో సంపూర్ణ శక్తిమంతమైనవని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10.  ఈనెల 10 నుంచి జమ్మూ-కశ్మీర్‌లో పర్యాటకులకు అనుమతి

జమ్మూ-కశ్మీర్‌లో పర్యాటకుల సందడి తిరిగి ప్రారంభం కానుంది. గురువారం (ఈ నెల పదోతేదీ) నుంచి పర్యాటకులను అనుమతించాలని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ నిర్ణయించారు. 370 అధికరణం రద్దు నేపథ్యంలో రెండు నెలల క్రితం రాష్ట్రంలోని పర్యాటకులందరూ వెళ్లి పోవాలంటూ ప్రభుత్వం అత్యవసర ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.