close

తాజా వార్తలు

మైనారిటీలపై చైనా ద్వంద్వ నీతికి అమెరికా చెక్‌!

వాషింగ్టన్‌: కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలంటూ అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్న చైనా నిజస్వరూపాన్ని అగ్రరాజ్యం అమెరికా బట్టబయలు చేసింది. షింజియాంగ్‌ ప్రాంతంలో ఉయిఘర్ మైనారిటీలపై చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని తేటతెల్లం చేసింది. ఈ విషయంలో చైనాకు మద్దతుగా నిలిచిన 28 చైనా కంపెనీలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. దీంతో ఎగుమతి నియంత్రణ నిబంధనల(ఈఏఆర్‌) పరిధిలోని వస్తువులపై పరిమితులు విధించనున్నారు. దీనిపై అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్‌ రాస్‌ మాట్లాడుతూ.. మానవ హక్కుల ఉల్లంఘనల్ని తమ దేశం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు. మైనారిటీలపై దురాగతాలకు పాల్పడడానికి అమెరికాకు చెందిన సాంకేతికతను వినియోగించడం ఏమాత్రం సహించబోమని తేల్చి చెప్పారు.

స్వయంప్రతిపత్తి గల షింజియాంగ్‌ ఉయిఘర్‌ ప్రాంతంలో చైనా పాల్పడుతున్న ఉల్లంఘనలు, అణచివేత, భారీ నిఘాలో చిక్కుకున్న సంస్థలన్నింటిని అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. తాజా నిబంధనలతో ఆయా కంపెనీల ఎగుమతులు, దిగుమతులు, సాంకేతికత మార్పిడికి సంబంధించి కొత్త అనుమతులు లేదా అదనపు లైసెన్స్‌లు పొందాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు కల్పించిన రాయితీలను సైతం ఎత్తివేసే అవకాశం ఉంది. అక్టోబర్‌ 10న ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. ఈ తరుణంలో తాజా నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకొంది. 

కశ్మీర్‌పై పాక్‌కు వంత పాడుతున్న చైనా.. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అవగాహనారాహిత్యంగా వ్యవహరించింది. ఆంక్షల పేరిట కశ్మీర్‌ ప్రజల్ని వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. వీలైనంత త్వరగా నిషేధాజ్ఞలు తొలగించాలని హితవు పలికింది. ఓవైపు నీతి వాక్యాలు వల్లెవేస్తూనే మరోవైపు ఉయిఘర్లపై నియంత్రణ విషయంలో మౌనం వహిస్తూ వచ్చింది. తాజాగా ఆమెరికా ఆంక్షలతో చైనాలో మావన హక్కుల ఉల్లంఘన నిజమని స్పష్టమైంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.