
తాజా వార్తలు
టెస్టు వైస్ కెప్టెన్‌కు సచిన్ సరదా ట్వీట్
ముంబయి: టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానె శనివారం తండ్రి అయ్యాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా అతడికి ఈ విషయం తెలిసినా ఆదివారం మ్యాచ్ పూర్తయ్యాకే ఇంటికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం తన జీవితభాగస్వామి రాధిక, కుమార్తెతో కలిసి దిగిన ఫొటోని రహానె ట్వీట్ చేశాడు. అది చూసిన క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ రహానె దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు.
సచిన్ సరదాగా ట్వీట్ చేస్తూ ‘రాధిక, రహానె మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. తొలిసారి తల్లిదండ్రులయ్యారు. ఈ ఆనందంతో ఏదీ సరితూగదు. అందులో మునిగితేలండి. డైపర్లు మారుస్తూ నైట్‌వాచ్‌మెన్‌గా కొత్త అవతారాన్ని ఎంజాయ్ చెయ్’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా సీనియర్ క్రికెటర్ హర్భజన్‌సింగ్ శనివారమే రహానెకు కూతురు పట్ట్టిందని వెల్లడిస్తూ ట్విటర్లో అభినందనలు తెలిపాడు. అలాగే టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ సైతం ట్విటర్ వేదికగా రహానె కుంటుంబానికి శుభాకాంక్షలు తెలిపాడు. ‘నువ్వు జీవితాంతం ఆడే ఉత్తమ ఇన్నింగ్స్ ఇదే. అప్పుడప్పుడూ సమయాన్ని ఆస్వాదించు’ అని ట్వీట్ చేశాడు. రహానె, రాధిక చిన్ననాటి స్నేహితులు. వారి మధ్య ప్రేమ ఏర్పడి పెద్ద సమక్షంలో 2014లో ఒక్కటైన విషయం తెలిసిందే.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- టీమిండియా సమష్టి విజయం
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
