
తాజా వార్తలు
అమరావతి: ఈ-ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్ట్‌లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో రివర్స్ టెండరింగ్‌ను మరింత పటిష్టంగా అమలు చేయడంపై చర్చించారు. రూ.100కోట్లు పైబడిన కాంట్రాక్టు పనులను ముందస్తు న్యాయసమీక్షకు నివేదించడం ద్వారా దేశంలో అత్యుత్తమ పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టామని సీఎం అన్నారు. రూ.10లక్షల కంటే విలువైన పనులు, సర్వీసులు, కొనుగోళ్ల కోసం నిర్వహించే టెండర్లలో పారదర్శకతకు పెద్దపీట వేసేలా సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం ఆదేశాల ప్రకారం జనవరి 1 నుంచి కొత్తపాలసీ అమల్లోకి రానుంది. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ఈ-ప్రొక్యూర్మెంట్ ఫ్లాట్‌ఫాం మీదే సాధ్యమైనంతమేర పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రూ.100కోట్లు పైబడిన కాంట్రాక్టులను ముందస్తు న్యాయసమీక్ష ప్రక్రియకు నివేదించడం ద్వారా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్‌ను మరింత బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కనీసం ఐదుగురు లేదా బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి 60శాతం మందికే రివర్స్‌టెండరింగ్‌కు అర్హులయ్యేలా చూడాలన్నారు. బిడ్డింగ్‌లో 10 మంది పాల్గొంటే అందులో ఎల్ 1 నుంచి ఎల్ 6 వరకూ అవకాశం ఇవ్వాలన్నారు. దీనివల్ల బిడ్డింగ్ ప్రక్రియలో కోట్ చేసేటప్పుడు వాస్తవికత ఉంటుందని, రివర్స్ టెండరింగ్‌లో మరింత పోటీకి దారితీస్తుందని సీఎం చెప్పారు.
ప్రభుత్వ పనులు, సర్వీసులు, కాంట్రాక్టుల్లో శాశ్వత ప్రాతిపదికన పారదర్శకత తీసుకొచ్చేలా ఒక పాలసీ ఉండాలని సీఎం ఆదేశించారు. టెండర్లలో ఎక్కువమంది పాల్గొనేలా ఈ విధానం ఉండాలన్నారు. టెండర్లలో పాల్గొనే వారికి నిరుత్సాహం కలిగించే పరిస్థితి ఉండకూడదని సీఎం స్పష్టంచేశారు. టెండర్లలో పేర్కొంటున్న అంశాలు మరింత విశదీకరంగా ఉండాలని, అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. తక్కువ ధరకు కోట్ చేసిన టెండర్ వివరాలను ఇ–ప్రొక్యూర్ మెంట్ సైట్లో డిస్ప్లే చేయాలని, వారంరోజులపాటు ఈ వివరాలు అందరికీ అందుబాటులో ఉంచి.. ఆతర్వాత రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం రాష్ట్రస్థాయిలోనే కాకుండా జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని కూడా సీఎం ఆదేశించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- కోహ్లీ×విలియమ్స్: గెలుపెవరిదో చూడాలి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
