close

తాజా వార్తలు

ఆ కుటుంబాలకు రూ.5.5 లక్షల ప్యాకేజీ

దిల్లీ: పొరుగుదేశం దురాక్రమణ సమయంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వచ్చి దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో నివసించి తిరిగి జమ్మూకశ్మీర్‌లో స్థిరపడిన కుటుంబాలకు కేంద్రం పునరావాస ప్యాకేజీ ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.5.5 లక్షల చొప్పున మొత్తం 5,300 కుటుంబాలకు అందజేయనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ భేటీలో బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయా కుటుంబాలు నిరంతర ఆదాయం పొందేందుకు వీలుగా రూ.5.5లక్షలు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద అందజేస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

2016లో నాటి కేబినెట్‌ పాక్‌ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌, ఛాంబ్‌ నుంచి భారత్‌కు చేరుకున్న కుటుంబాలకు ప్యాకేజీని ప్రకటించింది. అయితే అనేక కుటుంబాలకు ఆ జాబితాలో చోటు దక్కలేదు. వారి కోసం తాజా ప్యాకేజీని ప్రకటించారు. 1947లో పాకిస్థాన్‌.. జమ్మూకశ్మీర్‌లో దురాక్రమణకు పాల్పడింది. ఆ సమయంలో 31,619 కుటుంబాలు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి తరలివెళ్లాయి. మళ్లీ 1965, 1971లో భారత్‌- పాక్‌ మధ్య జరిగిన యుద్ధ సమయంలో చాంబ్‌-నియాబత్‌ ప్రాంతం నుంచి మరో 10,065 కుటుంబాలు తరలిపోయాయి. అలా తరలిపోయిన వారిని ఆదుకునే సదుద్దేశంతో 2016లో ఓ ప్యాకేజీని ప్రకటించింది. అలా జమ్మూకశ్మీర్‌లో స్థిరపడిన కుటుంబాలకు ప్రకటించిన ప్యాకేజీలో 36,384 కుటుంబాలకు మాత్రమే చోటు దక్కింది.  ఆ జాబితాలో చోటు చేసుకోని 5,300 కుటుంబాలకు తాజాగా ప్యాకేజీని ప్రకటించారు. యుద్ధాలు, ఘర్షణలు కారణంగా ఆర్థిక చితికిపోయిన ఈ కుటుంబాలకు నెలవారీ కొంతైన ఆదాయం దక్కాలన్న లక్ష్యంతో వీరికి ప్యాకేజీ ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.