close

తాజా వార్తలు

‘పోలవరం పూర్తిచేయాలనేదే మా సంకల్పం’

13న కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తాం: కన్నా

గుంటూరు: బాపూజీ 150వ జయంతిని పురస్కరించుకొని గాంధీ సంకల్ప యాత్ర చేపట్టనున్నట్టు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో భాజపా పార్లమెంట్‌ సభ్యులు ఈ యాత్రలో పాల్గొంటారన్నారు. గురువారం ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బాపూజీ సిద్ధాంతాలు పాటించడం, ఆయన ఆశయాలు సాధించడం కోసమే ఈ యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును రేపు సందర్శిస్తామనీ.. ప్రస్తుతం ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందో పరిశీలిస్తామన్నారు. పోలవరం భవిష్యత్తు గురించి అదికారులతో చర్చిస్తామని కన్నా తెలిపారు. ఈ నెల 13న దిల్లీలో కేంద్ర జలవనరుల శాఖమంత్రిని కలుస్తామని చెప్పారు. పోలవరం కచ్చితంగా పూర్తిచేయాలనేదే తమ పార్టీ సంకల్పమని కన్నా స్పష్టంచేశారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.