close

తాజా వార్తలు

వీలునామా రాసిన రాజేంద్రప్రసాద్‌..!

తోలుబొమ్మలాట మోషన్‌ పోస్టర్‌ విడుదల

హైదరాబాద్‌: ‘నేను నా పిల్లలకు ఇచ్చిన మాటతో సంతోషంగా ఉన్నానని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ నిర్ణయాన్ని పూర్తి ఆరోగ్యంతో, మనస్ఫూర్తిగా నా స్వహస్తాలతో రాస్తున్న వీలునామా.’ అని అంటున్నారు టాలీవుడ్‌ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌. ఆయన కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘తోలుబొమ్మలాట’. విశ్వనాథ్‌ మాగంటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో కుటుంబపెద్దగా రాజేంద్రప్రసాద్‌ చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ మోషన్‌ పోస్టర్‌లో నటీనటుల మధ్య జరిగిన సంభాషణలు వింటే కుటుంబంలో ఆస్తి తగాదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్‌ తన కుటుంబసభ్యులకు వీలునామా రాసినట్లు అర్థమవుతోంది. పూర్తి కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.