close

తాజా వార్తలు

చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌

చెన్నై: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చెన్నై చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి పళనిస్వామి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాక్షేత్ర వారి ఆధ్వర్యంలో రుక్మిణీ దేవి బృందంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మైలాపూర్‌ కపాలేశ్వర స్వామి ఆలయ పూజారుల వేద మంత్రాల నడుమ జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభాన్ని బహూకరించారు. దీని ప్రాముఖ్యాన్ని అక్కడే ఉన్న చైనా అనువాదకుడు జిన్‌పింగ్‌కు వివరించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.