close

తాజా వార్తలు

ఒకే రికార్డు.. కోహ్లీ 15సార్లు బద్దలు

పుణె: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ద్విశతకంతో చెలరేగిన భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (254*) మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తరఫున అత్యధికంగా ద్విశతకాలు బాదిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ 7 ద్విశతకాలతో అగ్రస్థానంలో ఉండగా సచిన్ తెందుల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ ఆరు సార్లు డబుల్‌ సెంచరీలు చేశారు. అంతేకాకుండా భారత సారథుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన కెప్టెన్‌గానూ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఘనతను అందుకున్న కోహ్లీ తన రికార్డును 15వ సారి బద్దలు కొట్టడం విశేషం. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుని 15 సార్లు బద్దలు కొట్టిన ఏకైక ఆటగాడిగా రికార్డుల రారాజు చరిత్ర సృష్టించాడు. 


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.