close

తాజా వార్తలు

బౌండరీ కొట్టి.. బ్యాట్స్‌మన్‌ పరుగులు

నవ్వులు పూయిస్తున్న వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: బంతి బౌండరీ దాటిన అనంతరం ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా పరుగులు తీయడం చూశారా..? తాజాగా అలాంటి విచిత్ర ఘటన అభిమానులకు నవ్వులు తెప్పిస్తోంది. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనను ఓ క్రీడా వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పోస్టు చేయడంతో అభిమానులు నవ్వుకుంటున్నారు. 

ఆస్ట్రేలియాలో నిర్వహించే షెఫీల్డ్‌ షీల్డ్‌ దేశవాళీ క్రికెట్‌లో.. ఓ బ్యాట్స్‌మన్‌ కొట్టిన బంతి థర్డ్‌ స్లిప్‌ దిశగా బౌండరీ చేరింది. అయినా బ్యాట్స్‌మన్‌ పరుగులు తీస్తూ కనిపించాడు. విచిత్రమేంటంటే అవతలివైపున్న బ్యాట్సమన్‌ పరుగెత్తకపోయినా బౌండరీ కొట్టిన అతడు రెండు పరుగులు తీశాడు. అది చూసిన ఇద్దరు వ్యాఖ్యాతలు నవ్వు ఆపుకోలేకపోయి ఆ బ్యాట్స్‌మన్‌పై జోకులు వేశారు. ఒక వ్యాఖ్యాత నవ్వుతూ ‘నువ్వెన్ని పరుగులు తీసినా నాలుగు కంటే ఎక్కువ రావు’ అని అన్నాడు. మరో వ్యాఖ్యాత ‘నువ్వు ఇప్పుడు ఎనిమిది పరుగులు తీశావు’ అని సరదాగా నవ్వాడు. ఈ వీడియో చూసిన అభిమానులు సరదా కామెంట్లు పెడుతున్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.