close

తాజా వార్తలు

అవసరమైతే బైక్‌లపై ముగ్గురు ఎక్కిరండి..

మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబయి: సాధారణంగా ఎన్నికలంటే బోలెడన్ని హామీలు, ప్రచార సభలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ సమయంలో వివాదాలకూ కొదవుండదు. ప్రచార సభల్లో అత్యుత్సాహం ప్రదర్శించి వివాదంలో ఇరుక్కుపోయే అభ్యర్థులు కూడా ఉన్నారు. మరో వారం రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ప్రచారం జోరెక్కింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ట్రాపిక్‌ నియమాలను ఉల్లంఘనలు తగ్గించాలని ప్రభుత్వం కొత్త నిబంధలను తీస్తుంటే మంత్రిగారు ఏకంగా వాటికే ఎసరు పెట్టేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భాజపా భారీగా ఏర్పాట్లు చేస్తోంది. మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునివ్వడంలో భాగంగా అక్కడి మంత్రి పరిణయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించైనా సరే సభకు రావాలని వ్యాఖ్యానించారు. 

‘ద్విచక్ర వాహనాల్లో వచ్చే కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. అవసరమైతే బైక్‌లపై ముగ్గురు ఎక్కిరండి..ఇంకా అవసరమైతే ఐదుగురు కూడా రండి. పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటే నా పేరు చెప్పండి. మీరు నా మనుషులని వారితో చెప్పండి. మీరు ప్రయాణించే వాహనాలు నావనే చెప్పండి. అయినప్పటికీ వదిలిపెట్టకపోతే..నేను వచ్చి మిమ్మల్ని విడిపిస్తాను’ అంటూ అభయమిచ్చి వివాదంలో చిక్కుకున్నారు. పరిణయ్‌..ఈ ఎన్నికల్లో ఆయన సాకోలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో శివసేన నేత కిశోర్‌ తివారీ స్పందించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కానివని అన్నారు. తీవ్రంగా పరిగణించాల్సిన వ్యాఖ్యలంటూ మండిపడ్డారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.