close

తాజా వార్తలు

రూపాయికే వైద్య పరీక్షలు..రూ.10కే భోజనం

శివసేన మేనిఫెస్టో విడుదల

ముంబయి: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని శివసేన పార్టీ మేనిఫెస్టోను శనివారం విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో ఆ పార్టీ హామీల వర్షం కురిపించింది. ప్రజాకర్షక, సంక్షేమ హామీలను ముందుకు తెచ్చింది. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తన నివాసంలో ఈ మేనిఫెస్టోను విడుదలచేశారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా మేనిఫెస్టో ఉన్నట్లు తెలిపారు. 
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
* రాష్ట్రవ్యాప్తంగా అందరికీ రూ.10కే భోజనం. రూ.1కే వైద్య పరీక్షలు .
*300 యూనిట్ల వరకు విద్యుత్‌పై 30 శాతం రాయితీ. ఏటా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.10వేలు జమ. యువతకు రూ.15లక్షల వరకు స్కాలర్‌షిప్పులు.
* మరాఠీలో 80శాతానికిపైగా మార్కులు సాధించిన 10, 12వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక నగదు సాయం.
* ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన కింద రోడ్ల నిర్మాణం. ముంబయిలో మడ అడవుల అభివృద్ధి వంటివి ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.