
తాజా వార్తలు
న్యూదిల్లీ: రూ.1,260 కోట్ల మేరకు రెలిగేర్ నిధులను మాల్వీందర్సింగ్ సంస్థ ఆర్హెచ్ఎస్ హోల్డింగ్స్‌లోకి మళ్లించినట్లు ఎకనామిక్ అఫెన్స్ వింగ్ వెల్లడించింది. ఆ సంస్థ ఈ విషయాన్ని దిల్లీ కోర్టులో పేర్కొంది. సెబీ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది. రుణాలను రుణగ్రీహీతలు చేతులు మారుస్తూ నిధులను మళ్లించినట్లు ఈ దర్యాప్తులో తేలింది.
రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్(ఆర్ఎఫ్ఎల్)కు చెందిన రూ. 2,397కోట్లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఫోర్టిస్ హెల్తెకేర్ మాజీ ప్రమోటర్ మల్విందర్ సింగ్‌ను ఇటీవల పంజాబ్‌లోని లూధియానాలో అరెస్టు చేశారు.
ఈ కేసులో మల్విందర్ సోదరుడు శివిందర్ సింగ్, మరో ముగ్గురిని గురువారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మల్విందర్ పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అనంతరం విస్తృత గాలింపు చేపట్టి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత లూధియానాలో అరెస్టు చేశారు.
మల్విందర్, శివిందర్ గతంలో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్(ఆర్ఈఎల్)కు ప్రమోటర్లుగా ఉన్నారు. దీనికి అనుబంధ సంస్థే ఆర్ఎఫ్ఎల్. అయితే సింగ్ సోదరులు, ఆర్ఈఎల్ మాజీ ఛైర్మన్ సునీల్ గోధ్వానీ తదితరులు కంపెనీ నుంచి రుణాలు తీసుకుని, వాటిని పక్కదోవ పట్టించి వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆర్ఎఫ్ఎల్కు రూ. 2,397కోట్ల నష్టం వచ్చింది. ఈ వ్యవహారంపై ఆర్ఎఫ్ఎల్కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ సురి ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం వీరిపై కేసు నమోదు చేసింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
