
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ట్విటర్ వేదికగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఆదివారం అతడి ఫొటోను ట్విట్ చేసిన ఐసీసీ దానికి క్యాప్షన్ పెట్టమని అభిమానులను కోరింది. దీంతో అభిమానుల నుంచి విచిత్ర స్పందన వచ్చింది. టీమిండియా కోచ్‌ని ట్రోలింగ్‌కు గురిచేస్తూ అనేక మీమ్స్‌తో ఆటపట్టించారు. టైటానిక్ సినిమాలో హీరో, హీరోయిన్లు ఓడ అంచున నిలబడి రెండు చేతులూ చాచినట్లు రవిశాస్త్రి ఆ ఫొటోలో చేతులుచాచి కనిపించాడు. ఇది చూసిన అభిమానులు అతడి లైఫ్‌స్టైల్‌కు తగ్గట్టు సరదాగా ట్రోలింగ్ చేశారు. అలాగే టైటానిక్ ఫొటోలకు రవిశాస్త్రి ముఖాన్ని అంటించి రీట్వీట్లు చేశారు.
ఇటీవల వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి రెండోసారి ఆగస్టులో ఎంపికయ్యాడు. అతడి నేతృత్వంలో విండీస్‌పై అన్ని ఫార్మాట్లు గెలిచిన కోహ్లీసేన ప్రస్తుతం దక్షిణాఫ్రికా తలపడుతోంది. మూడు టీ20ల సిరీస్ 1-1తో సమం కాగా మరో మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయింది. తాజాగా తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టులో విజయబాటలో పయనిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మరింత ముందుకు దూసుకెళుతుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
