
తాజా వార్తలు
జల్గావ్(మహారాష్ట్ర): జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన అధికరణ 370ని తిరిగి పునరుద్ధరించగలరా అని ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలకు సవాల్ విసిరారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన ఆదివారం జల్గావ్లో పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్-ఎన్సీపీ కేవలం ఒకరికొకరు మాత్రమే మద్దతుగా నిలవగలరని.. ప్రజల కలల్ని మాత్రం సాకారం చేయలేరన్నారు. అధికరణ 370 రద్దుపై అనసర ఆరోపణలు చేస్తూ విపక్షాలు ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేవలం భూభాగాలు మాత్రమే కాదని.. అవి దేశానికి కిరీటం లాంటివని వ్యాఖ్యానించారు. అక్కడి శాంతి భద్రతల్ని దృష్టిలో ఉంచుకునే ఆంక్షలు విధించాల్సి వచ్చిందని వివరించారు. అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు పునరుద్ధరణకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు.
మహారాష్ట్ర సహా దేశంలోని ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం రూ.3.5లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. 2022 నాటికి ప్రతి సామాన్యుడి కలల్ని సాకారం చేస్తామన్నారు. నేరుగా రైతుల్నే ఎగుమతిదారులుగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ఈ కార్యరూపందాలిస్తే రైతుల ఆర్థిక కష్టాలు తీరిపోతాయన్నారు. ఐదేళ్ల క్రితం నవ భారత నిర్మాణం కోసం ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు కూడా తమ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
