
తాజా వార్తలు
1. ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు
రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు 1న రాష్ట్ర వ్యాప్తంగా సంస్కరణలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వీటిద్వారా ఇకపై క్రయ, విక్రయదారులే డాక్యుమెంట్ తయారుచేసుకునే అవకాశం కలగనుంది. డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం లభించనుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ రుసుము చెల్లింపు, టైమ్‌స్లాట్ పొందేందుకు ప్రభుత్వం వీలుకల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డికి కొవ్వొత్తుల నివాళి
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరితో కలత చెంది ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డికి వివిధ రాజకీయ పార్టీ నేతలు, ప్రజా, ఉద్యోగ సంఘాలు, ప్రజలు కొవ్వొత్తులతో రాష్ట్ర వ్యాప్తంగా నివాళి అర్పించాయి. ఖమ్మంలోని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి భాజపా ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు, ఆర్టీసీ ఐరాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, ఇతర నేతలు వెళ్లి సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.
3. దసరా సెలవుల పొడిగింపుపై గందరగోళం
తెలంగాణలో దసరా సెలవుల పొడిగింపుపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈనెల 19 వరకు అన్ని పాఠశాలలకు దసరా సెలవులు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెలవులు పొడిగించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా మరో వైపు.. రేపటి నుంచి యథాతథంగా తరగతులు ప్రారంభమవుతాయని పలు కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సందేశాలు పంపాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ప్యాకింగ్‌లో వీటిని వాడొద్దు: ప్రభుత్వం
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా అన్ని ఈ-కామర్స్ సంస్థలు వస్తువులను ప్యాకింగ్ చేసే సమయంలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల(సింగిల్ యూజ్ ప్లాస్టిక్)ను వినియోగించవద్దని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సూచించింది. దశల వారీగా దీన్ని అమలు చేయాలని కోరింది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే క్రమంలో ఈ చర్యలు ఉపక్రమించినట్లు ప్రభుత్వం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. సమ్మె అణచేందుకు కేసీఆర్ యత్నం:రేవంత్
ఆర్టీసీ సమస్య ఎర్ర బస్సుది కాదని... పేద ప్రజల సమస్య అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. రెండు రోజులు డ్యూటీకి రానివారు సెల్ఫ్ డిస్మిస్ అయితే... ఆరేళ్లు సచివాలయానికి రాని కేసీఆర్‌పై పీడీ యాక్ట్ పెట్టి అండమాన్ జైల్లో పెట్టాలన్నారు. ఆర్టీసీ కార్మికులు అధికారికంగా నోటీసు ఇచ్చి సమ్మె చేస్తున్నారని గుర్తు చేశారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు సీఎం రంగం సిద్ధం చేశారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఉద్యోగానికి బదులు చంద్రుడ్ని చూపిస్తున్నారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇందుకోసం ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని అస్త్రంగా ఎంచుకున్నారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.దేశంలో కోట్లాది మంది ప్రజలు సమస్యలతో సతమవుతుంటే వారి దృష్టిని మరల్చేందుకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని వాడుకున్నారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న కేంద్ర మంత్రి
దేశ ఆర్థిక పరిస్థితికి, సినిమా కలెక్షన్లకు లంకె పెడుతూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వివాదానికి తెరలేపాయి. దీంతో తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 2న విడుదలైన మూడు సినిమాలు కేవలం ఒక్కరోజులోనే రూ.120కోట్లు వసూలు చేశాయని.. ఇక దేశంలో ఆర్థిక మందగమనం ఎక్కడ ఉందని శనివారం ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. చరిత్ర సృష్టించిన కోహ్లీసేన
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో టీమ్ఇండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీసులు గెలిచిన ఏకైక జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. 2012/13 నుంచి భారత్ స్వదేశంలో ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. 1994/95 నుంచి 2000/01 మధ్యలో ఆసీస్ సొంతగడ్డపై వరుసగా 10 టెస్టు సిరీసులు గెలుచుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. శ్రీవారికి పున్నమి గరుడసేవ
శ్రీవారికి పౌర్ణమి గరుడసేవ కన్నులపండువగా జరిగింది. ప్రతి నెలా పౌర్ణమి రోజు తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 7 నుంచి 9గంటల వరకు మలయప్పస్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
10. జపాన్‌లో హగిబిస్ తుపాను పెను బీభత్సం
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- హైదరాబాద్‌లో విద్యార్థుల ఆందోళన
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
