close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. తెరాసకు సీపీఐ మద్దతు ఉపసంహరణ

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో తెరాసకు సీపీఐ మద్దతు ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. గత పది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం వైఖరి దుర్మారంగా ఉందని మండిపడ్డారు. చర్చలను నిరాకరిస్తూ దాదాపు 48వేల మంది కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ ప్రకటించడం ద్వారా కార్మికులను రెచ్చగొట్టిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. సోషల్‌మీడియా-ఆధార్‌ లింక్‌ విచారణకు సుప్రీం నో

ఫేస్‌బుక్‌, ట్విటర్ లాంటి సోషల్‌మీడియా ఖాతాలకు ఆధార్‌ నంబరును అనుసంధానించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై ఇప్పటికే మద్రాసు హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడికే వెళ్లాలని పిటిషన్‌దారుకు న్యాయస్థానం సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. బతికి సాధించాలి.. ఆత్మహత్యలొద్దు: చంద్రబాబు

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇద్దరు కార్మికులు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడటం తనను కలచివేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నెల్లూరులోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గాల సమీక్షలో మాట్లాడుతూ కార్మికుల ఆత్మహత్యలపై స్పందించారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. జీవితం ఎంతో విలువైనదని.. బతికి సాధించాలే తప్ప బలవన్మరణం పరిష్కారం కాదని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. స్పెక్ట్రమ్‌ ధరల్లో సంస్కరణలు: రవిశంకర్‌ ప్రసాద్‌

5జీ సహా రేడియో తరంగాల అధిక ధరలపై ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర టెలికాంశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌  కీలక ప్రకటన చేశారు. స్పెక్ట్రమ్‌ ధరల్లో సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. సచివాలయం ఎందుకు కూల్చేస్తున్నారు?:హైకోర్టు

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. పీఎల్‌ విశ్వేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. వివిధ అంశాలపై ఉన్నత న్యాయస్థానం పిటిషనర్‌, ప్రభుత్వ తరఫు న్యాయవాదులను అడిగింది. సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం ఉన్న భవనాలకు అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని అగ్నిమాపక శాఖ నివేదిక ఇచ్చిందంటూ ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదనలు వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. అగ్రస్థానానికి ఒక్క పాయింట్‌ దూరంలో కోహ్లీ

తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ద్విశతకం బాదిన కోహ్లీ 936 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి టెస్టు అనంతరం అతడు 899 పాయింట్లతో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌ స్మిత్‌కు కోహ్లీ కేవలం ఒక్క పాయింట్‌ దూరంలో మాత్రమే నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఖురేషీ.. మరోసారి అక్కసు బయటపెట్టాడు.. 

అంతర్జాతీయ వేదికలపై ఘోరపరాభవం ఎదురై తల బొప్పి కడుతున్నా భారత్‌ పట్ల పాక్‌ తన కుట్రబుద్ధిని వీడటంలేదు. మనీలాండరింగ్‌, ఉగ్రమూకలకు నిధుల సరఫరాకు అడ్డకట్ట వేయడంలో తీసుకుంటున్న చర్యలపై ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) ప్యారిస్‌లో సమీక్షిస్తున్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. ఎఫ్‌ఏటీఎఫ్‌లో పాకిస్థాన్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేందుకు భారత్‌ సర్వశక్తులూ ఒడ్డుతోందని ఆయన ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. డీకే శివకుమార్ తల్లి, భార్యకు ఈడీ సమన్లు

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన కర్ణాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌  తల్లికి, సతీమణికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో డీకే శివకుమార్‌పై మనీలాండరింగ్‌ విషయమై కేసు నమోదైన విషయం తెలిసిందే. శివకుమార్ తల్లి గౌరమ్మను మంగళవారం, ఆయన భార్యను అక్టోబర్‌ 17న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. శివకుమార్‌ తల్లి, భార్య ఆర్థిక లావాదేవీల సమాచారం ఉండటంతోనే వారికి పంపినట్లు ఈడీ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. సఫారీసేనను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 45.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సఫారీసేన భారత బౌలర్ల ధాటికి 140 పరుగులకే కుప్పకూలింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. భారతదేశంలో తొలి అంధ మహిళా ఐఏఎస్‌ 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.