
తాజా వార్తలు
ముంబయి: సూపర్ ఓవర్ నిబంధనలో ఐసీసీ చేసిన మార్పును సచిన్ స్వాగతించాడు. విజేత తేలేవరకు సూపర్ ఓవర్లను నిర్వహించడం సరైన నిర్ణయమని అన్నాడు. ‘రెండు జట్లలో విజేతను తేల్చడానికి ఇదే ఉత్తమ మార్గంగా భావిస్తున్నాను’ అని మాస్టర్ బ్లాస్టర్ ట్వీట్ చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్×న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో బౌండరీల లెక్కతో విజేతను నిర్ణయించిన సంగతి తెలిసిందే. తుదిపోరు టైగా మారడంతో సూపర్ ఓవర్‌ను నిర్ణయించారు. కానీ, రెండు జట్లూ 15 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ కూడా సమమైంది. దీంతో మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. ఐసీసీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సూపర్ ఓవర్ నిబంధనను మార్చాలని ఐసీసీకి సచిన్ విజ్ఞప్తి చేశాడు. సచిన్‌తో పాటు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు కూడా సూపర్ ఓవర్ నిబంధనలపై పెదవి విరిచారు. దీంతో ఐసీసీ అనిల్‌కుంబ్లే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు సోమవారం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ‘మెగాటోర్నీ గ్రూప్ దశలో సూపర్ ఓవర్ టైగా మారితే మ్యాచ్ టై అయినట్లే. సెమీస్, ఫైనల్లో సూపర్ ఓవర్ టై అయితే విజేత తేలేవరకు సూపర్ ఓవర్ కొనసాగిస్తాం’ అని స్పష్టం చేసింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
