
తాజా వార్తలు
అమరావతి: అభ్యంతరంలేని అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకు సంబంధించిన విధివిధానాలు తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అలా గుర్తించిన ప్రాంతాల్లో 2 సెంట్ల వరకు నామినల్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అవకాశమివ్వాలని అధికారులను ఆదేశించారు. 2సెంట్లు పైబడితే రెగ్యులరైజేషన్ ఫీజు సహా ..వాటన్నింటిపైనా ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఉగాదికి పంపిణీ చేయనున్న పేదలపట్టాలు, గృహనిర్మాణాలపై సీఎం సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో అవకాశమున్నచోట ప్లాట్ల కన్నా పేదల ఇళ్లనిర్మాణంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం స్థలాల గుర్తింపు, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, రంగనాథరాజు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉగాదినాటికి పేదలందరికీ ఇళ్లు..
సీఎం సమీక్ష ముగిసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20లక్షల మంది అర్హులను గుర్తించామని తెలిపారు. పట్టణాల్లో 8లక్షల మంది ఇళ్ల కోసం అర్హులైన లబ్ధిదారులు ఉన్నారని వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని, పట్టణాల్లో అవకాశమున్న మేరకు వ్యక్తిగత ఇళ్లు కట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. జీప్లస్ ఇళ్ల నిర్వహణ ఇబ్బందిగా ఉండటంతో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణంపై నిపుణుల కమిటీ సూచన మేరకు రాజధాని రైతులకు త్వరలోనే లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. తుళ్లూరులో నిర్మించిన సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని నాలుగు రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- పోలీసులపై పూల జల్లు
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
