close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. హైకోర్టులో వాదనలపై కేసీఆర్‌ కసరత్తు

ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మెపై శుక్రవారంలోపు నిర్ణయం తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏయే అంశాలపై వాదనలు కొనసాగించాలనే విషయంపై సీఎం అధికారులతో కసరత్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పేదల ఇళ్లనిర్మాణంపై జగన్‌ సమీక్ష

అభ్యంతరంలేని అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకు సంబంధించిన విధివిధానాలు తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. అలా గుర్తించిన ప్రాంతాల్లో 2 సెంట్ల వరకు నామినల్‌ ఫీజుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా అవకాశమివ్వాలని అధికారులను ఆదేశించారు. 2సెంట్లు పైబడితే రెగ్యులరైజేషన్‌ ఫీజు సహా ..వాటన్నింటిపైనా ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఉగాదికి పంపిణీ చేయనున్న పేదలపట్టాలు, గృహనిర్మాణాలపై  సీఎం సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నమ్మకం ఉంటే భయమెందుకు?:చంద్రబాబు

తప్పును ఎత్తిచూపించే వారి నోళ్లు నొక్కేయాలనుకోవడం వైకాపా ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ వాక్‌ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కల్పించిందని గుర్తు చేశారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్‌ చేశారు. భావ వ్యక్తీకరణను హరించడం అప్రజాస్వామికమని ఆక్షేపించారు. తమ పనులపట్ల చిత్తశుద్ధి, నమ్మకం ఉంటే ఎందుకిలా భయపడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అసోంలో పడవ ప్రమాదం: పలువురి గల్లంతు

అసోంలో గురువారం సాయంత్రం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...  సోనిత్‌పూర్‌ జిల్లాలో జియా భరలి నదిలో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. లాల్‌ తపూ సమీపంలోని బిహియా గావ్‌ నుంచి తేజ్‌పూర్‌లోని పంచ్‌ మైల్‌ ప్రాంతానికి వెళ్తుండగా పడవ బోల్తా పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో బోటులో సుమారు 70 నుంచి 80 మంది వరకు ఉండి ఉంటారని స్థానికులు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రజల విశ్వాసం నిలబెట్టుకుంటాం: పేర్ని నాని

ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు, 50శాతం పైగా ప్రజల మద్దతుతో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రజల విశ్వాసం నిలుపుకొనేందుకు సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఏపీ మంత్రి  పేర్ని నాని స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక మీడియా సంస్థ తమ ప్రభుత్వంపై అక్కసుతో వార్తలు రాస్తూ, విషం చిమ్ముతోందని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల రివర్స్‌ టెండర్లతో రూ.750 కోట్లు ఆదాచేశామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తీహాడ్‌ నుంచి ఈడీ కస్టడీకి చిదంబరం

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో విచారణ ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కస్టడీకి అప్పగిస్తూ దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24 వరకు ఆయన్ను విచారించవచ్చని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ ఈడీకి అనుమతి ఇచ్చారు. విచారణ చేస్తున్నంతకాలం ఆయనకు ఇంటి భోజనం, ప్రత్యేక సెల్‌, వెస్ట్రన్‌ టాయిలెట్, మందులు సమకూర్చాలని న్యాయమూర్తి ఈడీ అధికారులను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రవిప్రకాశ్‌కు బెయిల్‌ మంజూరు

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఏబీసీఎల్‌ ఖాతాల నుంచి రూ.18కోట్లు అక్రమంగా తీసుకున్నారన్న అభియోగాలపై రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో గత కొన్ని రోజులుగా రవిప్రకాశ్‌ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఈకేసులో రవిప్రకాశ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం .. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని, హైదరాబాద్‌ విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కశ్మీర్‌కు వెళ్తారా.. నేను పంపిస్తా: మోదీ

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో నేతలు ప్రచార జోరు పెంచారు. మహారాష్ట్రలోని పార్లీ ప్రాంతంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ తనదైన తీరుతో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కశ్మీర్‌ను పోగొట్టుకున్నామా?మీరు కశ్మీర్‌కు వెళ్లి అక్కడ పరిస్థితులు చూస్తారా? నేను ఏర్పాట్లు చేస్తా’ అని కాంగ్రెస్‌ పార్టీపై మోదీ ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అఫ్గాన్‌ ఉగ్రవాదులను నియమించుకుంటున్న పాక్‌!

కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి పాకిస్థాన్‌ దళాలు అఫ్గన్‌ ఉగ్రవాదులను నియమించుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్‌లోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత కొద్దిరోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో కశ్మీరేతరులు, ఉర్దూ కాకుండా ఇతర భాష మాట్లాడే ఉగ్రవాదుల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు. ఇటీవల పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని  ఉగ్రవాదులకు పాక్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించనట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘విజిల్‌ ’ ట్రైలర్‌ వచ్చేసింది!

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.