
తాజా వార్తలు
ఒకే నెలలో 84 లక్షల మంది చందాదారుల చేరిక
దిల్లీ: టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం. మార్కెట్లోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే కోట్ల మంది కస్టమర్లను తనవైపునకు తిప్పుకొంది. తాజాగా జియో మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో 84 లక్షలకుపైగా కస్టమర్లు జియో నెట్‌వర్క్‌లోకి చేరినట్లు భారతీయ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) వెల్లడించింది. ఒకే నెలలో ఇంత పెద్ద సంఖ్యలో ఒక నెట్‌వర్క్‌లోకి కస్టమర్లు చేరడం ఇంతవరకు ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇదే సమయంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌ల వినియోగదారుల సంఖ్య తగ్గినట్లు ట్రాయ్ పేర్కొంది.
దాదాపు 84 లక్షలకుపైగా చందాదారులను చేర్చుకున్న జియో ఒకే నెలలో 2.49 శాతం వృద్ధి నమోదు చేసింది. ట్రాయ్ ఆగస్టు నివేదిక ప్రకారం.. ప్రస్తుతం రిలయన్స్ జియోకు 34.80 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇదే నెలలో భారతీ ఎయిర్టెల్ నుంచి 5 లక్షల మంది కస్టమర్లు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో 32.70 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు ట్రాయ్ నివేదికలో పేర్కొంది.ఎయిర్‌టెల్‌తో పోలిస్తే వొడాఫోన్ ఐడియా పెద్ద సంఖ్యలో సబ్స్క్రైబర్లను పోగొట్టుకుంది. దాదాపు 49 లక్షలకుపైగా నెట్‌వర్క్‌ను వీడగా.. ప్రస్తుతం 37.50 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
