close

తాజా వార్తలు

దొంగతనానికి వచ్చి ముద్దులు పెట్టాడు

బ్రెజిల్‌: బ్రెజిల్‌లో ఓ వింత దొంగతనం జరిగింది. ఓ ఫార్మా దుకాణలో దొంగతనం చేయడానికి వచ్చిన ఓ దొంగ డబ్బులు తీసుకోకుండా ఆ దుకాణం యజమాని భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. ఇదంతా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే... బ్రెజిల్‌లోని ఓ మందుల దుకాణంలోకి ఇద్దరు దొంగలు హెల్మెట్లు ధరించి దొంగతనానికి వచ్చారు. ఇద్దరిలో ఒకరు దుకాణ యజమానిని బెదిరించి డబ్బు తీసుకుంటుండగా ఆయన భార్య మరొక దొంగను కూడా డబ్బు తీసుకోవాల్సిందిగా కోరింది. అయితే ఆ దొంగ తనకు డబ్బులు వద్దంటూ ఆ వృద్దురాలి నుదుటిపై ముద్దుల వర్షం కురిపించాడు. తరువాత కూడా ఆ దొంగ ఆమె భుజాన్ని తడుతూ ఆమెతో మాట్లాడాడు. ఇదంతా దుకాణంలో ఉన్న కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వింత దొంగతనం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరొక దొంగ దుకాణం నుంచి కొన్ని సామాన్లు, 240 డాలర్లను తీసుకెళ్లాడు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.